రాయలసీమ ఎర్ర మిరపకాయ పచ్చడి.. రుచి వేరే లెవెల్..

Dharmaraju Dhurishetty
Dec 28,2024
';

చాలామంది పండుమిరపకాయతో తయారుచేసిన కారాన్ని ఎక్కువగా తినేందుకు ఇష్టపడుతూ ఉంటారు.

';

కొంతమంది అయితే ఇడ్లీ వడాల్లోకి ఎక్కువగా పండుమిరపకాయతో చేసిన కారాన్ని తినేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు.

';

పండు మిరపకాయ పచ్చడి నూటికి రుచి అందించడమే కాకుండా శరీరానికి అనేక రకాల ప్రయోజనాలనుందిస్తుంది.

';

మీరు కూడా ఇంట్లోనే ఈ ఎర్ర మిరపకాయల పచ్చడిని తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఎలాంటి శ్రమ లేకుండా ఇలా తయారు చేసుకోండి ఇప్పుడే..

';

కావలసిన పదార్థాలు: ఎర్ర మిరపకాయలు: 250 గ్రాములు, నూనె: 100 గ్రాములు, ఆవాలు: 2 టేబుల్ స్పూన్లు, మెంతులు: 1 టేబుల్ స్పూన్, జీలకర్ర: 1 టేబుల్ స్పూన్

';

కావలసిన పదార్థాలు: ఉప్పు: రుచికి సరిపడా, కారం: రుచికి సరిపడా, పసుపు: 1/2 టీ స్పూన్, నిమ్మరసం: 2 టేబుల్ స్పూన్లు

';

తయారీ విధానం: పండు మిరపకాయ పచ్చడిని తయారు చేసుకోవడానికి ముందుగా ఎర్రగా పండిన మిరపకాయలను నీటిలో వేసి శుభ్రం చేసుకోండి.

';

బాగా శుభ్రం చేసుకున్న పండుమిరపకాయలను నీరు లేకుండా ఆరబెట్టుకొని వాటిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.

';

ఆ తర్వాత స్టవ్ పై ఓ బౌల్ పెట్టుకొని అందులో అన్ని రకాల పోపు దినుసులు వేసుకొని దాదాపు చిటపటలాడే అంతవరకు వేయించుకోండి.

';

ఇలా బాగా వేయించుకున్న తర్వాత అందులో మిరపకాయ ముక్కలు మెత్తపడేంతవరకు బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత అందులోని కావలసినంత ఉప్పు వేసి మరికొద్దిసేపు వేపుకోండి.

';

ఇలా పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని గ్రైండర్ లో వేసి బాగా రుబ్బుకుంటే.. ఎర్ర మిరపకాయ పచ్చడి రెడీ అయినట్లే. రోజు ఇడ్లీలోకి తింటే రుచి వేరే లెవెల్ ఉంటుంది.

';

ఇలా వేపుకున్న తర్వాత అందులోనే పసుపు, కావలసినంత నిమ్మరసం వేసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story