న్యూ ఇయర్‌ను మరపురానిదిగా చేసుకుందాం.. ఈ 7 ప్రాంతాలు భూలోక స్వర్గాలే!
ఈ కొత్త సంవత్సరాన్ని మరచిపోలేని జ్ఞాపకంగా మలచుకునేందుకు సిద్ధమవ్వండికోండి. చలికాలం వేళ ప్రకృతి రమణీయ దృశ్యాలు.. ఆకాశమే దిగి వచ్చినట్టు ఉండే ప్రాంతాల్లో పర్యటించండి.
కేరళలో సుందరమైన ప్రదేశాల్లో ఒకటి టీ తోటలు. తేయాకు తోటల్లో విహరిస్తూ ప్రకృతిని ఆస్వాదించవచ్చు.
ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో రాణికేత్ ఉంది. సముద్ర మట్టానికి 1,829 మీటర్ల ఎత్తులో ఉన్న రాణికేత్లో పురాతన దేవాలయాలు, దట్టమైన అడవులు.. కొండలు ఉన్నాయి. ఇక్కడి దృశ్యాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి.
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు 2 గంటల ప్రయాణం చేస్తే పూరీ వస్తుంది. బంగాళాఖాతంలోని పూరీ తీర పట్టణం సందర్శించాల్సిందే. అక్కడ పురాతన ఆలయాలను దర్శించుకోవచ్చు.
కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ సమీపంలో ఉన్న నంది కొండలు స్వర్గలోకంగా కనిపిస్తుంది. సముద్ర మట్టానికి దాదాపు 4,851 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ పురాతన భవనాలు, రాజ భవనాలు, దేవాలయం ఉంది.
మహారాష్ట్రలోని అందమైన నగరాల్లో లోనావాలా ఒకటి. అనేక సుందరమైన పర్యాటక ప్రదేశాలు దీని సమీపంలో ఉన్నాయి. చారిత్రక కోటలు, పురాతన గుహలు, సరస్సులు, జలపాతాలతో ఈ ప్రాంతం నిండి ఉంటుంది.
మహారాష్ట్రలోని తీర ప్రాంత పర్యాటక ప్రదేశం అలీబాబా. అరేబియా సముద్రం అందాలు.. సంప్రదాయ కోటలను ఇక్కడ ఆస్వాదించవచ్చు.
తమిళనాడులోని పశ్చిమ కనుమలలో 7,200 అడుగుల ఎత్తులో ఉంది. భారీ వృక్షాలు, సరస్సులు, జలపాతాలను ఇక్కడ సందర్శించవచ్చు.