ఓట్స్‌తో బిస్కెట్స్‌.. ఆరోగ్యానికి ఎంతో మేలు!

Dharmaraju Dhurishetty
Sep 11,2024
';

ఓట్స్‌తో బిస్కెట్స్‌ కూడా తయారు చేయవచ్చు. ఇవి తినడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

';

ఈ ఓట్స్‌ బిస్కెట్స్‌లో ఉండే పోషకాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది.

';

మీరు కూడా ఈ బిస్కెట్స్‌ను తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

కావలసిన పదార్థాలు: 1 కప్పు ఓట్స్, ½ కప్పు గోధుమ పిండి, ½ కప్పు పంచదార

';

కావలసిన పదార్థాలు: ¼ కప్పు నెయ్యి, 1 గుడ్డు, 1 టీస్పూన్ బేకింగ్ పౌడర్, ¼ టీస్పూన్ ఉప్పు, చాక్లెట్ చిప్స్

';

తయారీ విధానం: ఓవెన్‌ను 180 డిగ్రీల సెల్సియస్‌కు ప్రీహీట్ చేయండి.

';

ఒక పాత్రలో ఓట్స్, గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా మిక్స్‌ చేయాల్సి ఉంటుది.

';

ఆ తర్వాత వేరొక పాత్రలో నెయ్యి, పంచదారను కలిపి క్రీమీగా బాగా మిక్స్‌ చేయాలి.

';

ఇందులోనే గుడ్డు కలిపి బాగా కలపండి. ఆ తర్వాత పొడి పదార్థాలను నెయ్యి మిశ్రమంలో కలిపి ఒక మృదువైన పిండిని చేయండి.

';

మీకు ఇష్టపడితే మిక్స్ ఫ్రూట్స్ లేదా చాక్లెట్ చిప్స్‌ను వేసి మిక్స్‌ చేయాల్సి ఉంటుంది.

';

పిండిని చిన్న చిన్న బాల్స్‌గా చేసి బేకింగ్ ట్రేలో పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ప్రీహీట్ చేసిన ఓవెన్‌లో 12-15 నిమిషాలు లేదా బంగారు రంగు వచ్చే వరకు బేక్ చేయండి.

';

బిస్కెట్లు చల్లారిన తర్వాత సర్వ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story