పిల్లలకు ప్రోటీన్‌ పెంచే పన్నీర్‌ రైస్‌..

Dharmaraju Dhurishetty
Aug 08,2024
';

పన్నీర్‌తో వివిధ రకాల ఆహారాలు తయారు చేసుకుంటారు.. ఎప్పుడైనా రైస్‌ తయారు చేసుకున్నారా?

';

పన్నీర్‌తో తయారు చేసుకున్న రైస్‌ తినడానికి అచ్చం పన్నీర్‌ బిర్యానిలా ఉంటుంది.

';

ఈ పన్నీర్‌ రైన్‌ను ఎక్కువగా పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు.

';

ఈ పన్నీర్‌తో పాటు రైస్‌ను కలిపి వండుకోవడం చాలా సులభం.. అయితే ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

';

పన్నీర్‌ రైన్‌కి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం - 2 కప్పులు, పనీర్ - 200 గ్రాములు, ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది)

';

కావలసిన పదార్థాలు: క్యాప్సికం - 1/2 (చిన్నగా తరిగినది), క్యారెట్ - 1/2 (తురిమినది), పచ్చిమిరపకాయ - 1 (చిన్నగా తరిగినది), అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్

';

కావలసిన పదార్థాలు: జీలకర్ర - 1 టీస్పూన్, ధనియాల పొడి - 1 టీస్పూన్, మిరియాల పొడి - 1/2 టీస్పూన్

';

కావలసిన పదార్థాలు: కారం - 1/2 టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 3 టేబుల్ స్పూన్లు

';

తయారీ విధానం: ఈ రెసిపీని తయారు చేయడానికి బియ్యాన్ని 30 నిమిషాల పాటు నానబెట్టండి.

';

పనీర్‌ను చిన్న ముక్కలుగా కోసి, ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి బాగా కలపండి.

';

ఒక పాన్‌లో నూనె వేడి చేసి, అందులో జీలకర్ర వేసి వేయించాలి.

';

ఆ తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.

';

ఉల్లిపాయ వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.

';

అన్ని వేగిన తర్వాత క్యాప్సికం, క్యారెట్, పచ్చిమిరపకాయ వేసి 2 నిమిషాలు వేయించాలి.

';

అందులో ధనియాల పొడి, మిరియాల పొడి, కారం వేసి బాగా కలపాలి.

';

నానబెట్టిన బియ్యాన్ని నీటితో సహా పాన్‌లో వేసి బాగా కలపాలి.

';

ఆ తర్వాత ఉప్పు వేసి, మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించాలి. మూత తీసి, పనీర్ ముక్కలు వేసి బాగా కలపాలి.

';

మరో 5 నిమిషాలు ఉడికించి, కొత్తిమీరతో అలంకరించి వేడిగా వడ్డించండి.

';

VIEW ALL

Read Next Story