పిల్లల ప్రోటీన్‌ పెంచే పన్నీర్ రోల్స్..

Dharmaraju Dhurishetty
Aug 07,2024
';

పన్నీర్‌ రోల్స్‌ను వివిధ రకాలుగా తయారు చేసుకుంటారు. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

';

పన్నీర్‌ రోల్స్‌ తయారు చేసే క్రమంలో బట్టర్‌ యాడ్‌ చేయడం వల్ల మరింత టేస్ట్‌ పొందుతారు.

';

సాయంత్రం స్నాక్‌గా మీరు కూడా ఇంట్లో పన్నీర్‌ రోల్స్‌ తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

పన్నీర్ రోల్స్ తయారీకి కావలసిన పదార్థాలు: పన్నీర్ - 200 గ్రా, ఉల్లిపాయ - 1 (తరిగిన), టమాటో - 1 (తరిగిన)

';

కావలసిన పదార్థాలు: కొత్తిమీర - 1 టేబుల్ స్పూన్ (తరిగిన), అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్, మిరపకాయ - 1 (తరిగిన), ధనియాల పొడి - 1 టీస్పూన్

';

కావలసిన పదార్థాలు: జీలకర్ర పొడి - 1/2 టీస్పూన్, మిరియాల పొడి - 1/2 టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా

';

కావలసిన పదార్థాలు: నూనె లేదా బట్టర్- వేయించడానికి, కావాలనుకుంటే నట్స్‌ కూడా వినియోగించవచ్చు.

';

పన్నీర్ రోల్స్ తయారీ విధానం: ఈ రోల్స్ తయారు చేయడానికి ముందుగా పన్నీర్‌ను చిన్న ముక్కలుగా కోసుకోండి.

';

ఒక పాన్‌లో నూనె వేడి చేసి, అందులో ఉల్లిపాయ వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.

';

అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరపకాయ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి బాగా కలపాలి.

';

ఆ తర్వాత టమాటో వేసి మెత్తబడేవరకు ఉడికించాలి. పన్నీర్ ముక్కలు వేసి బాగా కలపాలి.

';

ఇందులో కొత్తిమీర వేసి కలపాలి. ఉప్పు రుచికి సరిపడా వేసి కలపాలి.

';

పన్నీర్ మిశ్రమాన్ని చల్లబడేంత వరకు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

చపాతీలు, రొట్టెలు లేదా టోస్ట్‌లపై పన్నీర్ మిశ్రమాన్ని వేసి రోల్ చేయండి. అంతే రోల్స్ రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story