బెల్లీ ఫ్యాట్కి చెక్ పెట్టే చికెన్ సలాడ్ రెసిపీ.. రుచితో ఆరోగ్యం..
Dharmaraju Dhurishetty
Sep 22,2024
';
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. చికెన్ సలాడ్ ను తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ తో పాటు శరీర బరువు కూడా తగ్గుతుందట.
';
ప్రస్తుతం చాలామంది బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే దీని నుంచి విముక్తి పొందడానికి వివిధ రకాల డైట్లను అనుసరిస్తున్నారు.
';
కొంతమంది కఠిన తరం వ్యాయామాలు చేసినప్పటికీ బెల్లి ఫ్యాట్‌ను నియంత్రించుకోలేకపోతున్నారు.
';
నిజానికి బెల్లీ ఫ్యాట్ పోవడానికి వ్యాయామాలు ఎంత అవసరమో.. డైట్ కూడా అంతే అవసరమని ఆరోగ్యానికి గురించి చెబుతున్నారు.
';
బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి చికెన్ సలాడ్ ఎంతగానో సహాయపడుతుంది. ఇది శరీర బరువును కూడా నియంత్రణలో ఉంచుతుంది.
';
చికెన్ సలాడ్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: బాచ్చిన చికెన్ ముక్కలు - 2 కప్పులు, క్యారెట్ - 1 (తరుగు), ఉల్లిపాయ - 1 (తరుగు), బంగాళాదుంప - 1 (తరుగు), క్యాప్సికం - 1/2 (తరుగు)
';
కావలసిన పదార్థాలు: ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - 1/2 టీస్పూన్, కొత్తిమీర - కొద్దిగా (తరిగిన), మయోనీస్ - 2-3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్, వినెగర్ - 1 టీస్పూన్
';
తయారీ విధానం.. చికెన్ వండడం: ఒక పాత్రలో నీరు మరిగించి, అందులో చికెన్ ముక్కలు వేసి ఉప్పు, మిరియాల పొడి వేసి మెత్తగా ఉడికించి చల్లార్చాలి.
';
పదార్థాలను కలపడం: ఒక పెద్ద బౌల్ తీసుకొని, అందులో ఉడికించి ముక్కలుగా చేసుకున్న చికెన్, క్యారెట్, ఉల్లిపాయ, బంగాళాదుంప, క్యాప్సికం, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
';
డ్రెస్సింగ్ వేయడం: ఇప్పుడు ఈ మిశ్రమంలో మయోనీస్, నిమ్మరసం, వినెగర్ వేసి మళ్ళీ బాగా కలపాలి.
';
సర్వ్ చేయడం: రుచికరమైన చికెన్ సలాడ్ తయారైంది. దీనిని రెఫ్రిజిరేటర్లో చల్లార్చి, బ్రెడ్‌తో లేదా క్రాకర్స్‌తో సర్వ్ చేయండి.