నిమ్మరసంలో వీటిని కలుపుకొని తాగితే.. నెలలోనే 3 కేజీల బరువు తగ్గడం ఖాయం!
Dharmaraju Dhurishetty
Jan 05,2025
';
నిమ్మరసంలో సబ్జా గింజలను కలుపుకొని తాగడం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
';
ముఖ్యంగా ఈ డ్రింక్ రోజు తాగితే దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
';
సబ్జా గింజలు అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. అలాగే నిమ్మరసంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని రెండిటిని కలిపి తాగితే విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.
';
ముఖ్యంగా ఎలాంటి వ్యాయామాలు లేకుండా బరువు తగ్గాలనుకుంటున్న వారు రోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ తాగితే నెలల్లోని మంచి ఫలితాలు పొందగలుగుతారు.
';
సబ్జా గింజల నిమ్మ నీరును మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇదే..
';
కావలసిన పదార్థాలు: సబ్జా గింజలు - 1 టేబుల్ స్పూన్, నీరు - 1 గ్లాసు, నిమ్మరసం - 1-2 టేబుల్ స్పూన్లు (రుచికి సరిపడా), తేనె లేదా చక్కెర - రుచికి తగినంత (సరిపడా), పుదీనా ఆకులు - కొన్ని (అలంకరణ కోసం)
';
తయారీ విధానం: ఈ డ్రింకును తయారు చేసుకోవడానికి ముందుగా సబ్జా గింజలను రాత్రి అంతా నానబెట్టి ఉంచుకోవాల్సి ఉంటుంది.
';
ఉదయాన్నే బాగా నానిన సబ్జా గింజలను తీసుకొని ఒక గాజు గ్లాసులో వేసుకొని అందులో తగినంత నీటిని వేసుకోవాల్సి ఉంటుంది.
';
అదే గాజు గ్లాసులో తగినంత నిమ్మరసం, తేనే కలిపి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పుదీనా ఆకులు వేసి సర్వ్ చేసుకోండి..