గుండెను దృఢంగా చేసే లడ్డు.. రుచి వేరే లెవల్..

Dharmaraju Dhurishetty
Jun 25,2024
';

ప్రతి రోజు సన్‌ప్లవర్‌ సీడ్స్ లడ్డు తినడం వల్ల శక్తి పెరుగుతుంది.

';

అలాగే ఈ లడ్డుల్లో ఉండే గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.

';

ఇప్పటికే గుండె సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

మీరు కూడా సన్‌ప్లవర్‌ సీడ్స్ లడ్డును ఇట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

సన్‌ప్లవర్‌ సీడ్స్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు: సన్‌ప్లవర్‌ గింజలు - 1 కప్పు (వేయించిన), బెల్లం - 1/2 కప్పు (తరిగిన), నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు

';

కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము - 1/4 కప్పు, యాలకుల పొడి - 1/2 టీస్పూన్, జీడిపప్పు, పిస్తా - అలంకరించడానికి

';

తయారీ విధానం: ఒక బౌల్‌లో నెయ్యి వేడి చేసి, సన్‌ప్లవర్‌ గింజలు వేయించి, తక్కువ మంటపై 5 నిమిషాలు వేయించాలి.

';

గింజలు వేయించిన తర్వాత, వాటిని ఒక ప్లేట్‌లోకి తీసి చల్లబడనివ్వాలి.

';

ఒక గిన్నెలో బెల్లం, కొద్దిగా నీరు వేసి, మీడియం మంటపై పాకం వచ్చేవరకు ఉడికించాలి.

';

పాకం చిక్కగా వచ్చిన తర్వాత వేయించిన సన్‌ప్లవర్‌ గింజలు, కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి బాగా కలపాలి.

';

మిశ్రమం చల్లబడిన తర్వాత, చిన్న చిన్న లడ్డులుగా చేసుకోవాలి.

';

లడ్డులను జీడిపప్పు, పిస్తా ముక్కలతో అలంకరించి తినండి.

';

VIEW ALL

Read Next Story