చాలా మంది బ్లౌజులక రకరకాల డిజైన్స్ వేయించుకుంటారు. మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్, మిర్రర్ వర్క్, నార్మల్ డిజైన్స్ తో బ్లౌజులు వేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. వీటితో పాటు టసెల్స్ కూడా బ్లౌజుల అందాన్ని మరింత పెంచుతాయి.
ఈ కాలంలో అమ్మాయిల నుంచి ఆంటీల వరకు ఫ్యాషన్ కు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తున్నారు. ముఖ్యంగా డ్రెస్సింగ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారు. అలాంటి వారికి ఈ డిజైనర్ టసెల్స్ తీసుకువచ్చాం. మీరూ ట్రై చేయండి.
బ్లౌజ్ లేదా సూట్ ఏదైనా సరే వాటికి టసెల్స్ తో డిజైన్ చేస్తే అందాన్ని మరింత పెంచుతాయి.
చీర లేదా ప్లెయిన్ సూట్ అందాన్ని పెంచే 5 రకాల లాకెట్ డిజైన్ టస్సెల్స్ ఉన్నాయి. ఓసారి చూడండి.
ముత్యాలు, క్రిస్టల్ పూసలతో తయారుచేసిన డిజైన్ లాకెట్టు బ్లౌజ్ పై అద్భుతంగా కనిపిస్తాయి. ఇవి పాస్టెల్ టోన్ సూట్స్పైఅద్భుతంగా కనిపిస్తాయి.
ఈ రకమైన గోల్డెన్ ఎంబ్రాయిడరీ పెర్ల్ లాకెట్ బ్యాక్ లెస్ బ్లౌజ్ కు అందంగా ఉంటుంది. సాధారణ బ్లౌజుకు కూడా నప్పుతుంది.
వీ ఆకారపు బ్లౌజ్ తో బ్రూచ్ స్టైల్ లట్ కాన్ ను జోడిస్తే అద్భుతమైన లుక్ ఉంటుది. ఈ రకమైన టాసెల్స్ బ్లౌజ్ డిజైన్ ను మరింత పెంచుతాయి.
వీటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుది. కలర్ ఫుల్ పోప్ పోమ్ టాసెల్స్ తో కొన్ని ఫంకీ లుక్స్ క్రియేట్ చేస్తాయి. ఇవి కుర్తీలకు బాగుంటాయి.
పెళ్లిళ్లు, సంగీత్, హల్దీ వంటి ఫంక్షన్స్ కు సూపర్బ్ గా ఉంటాయి. ఈ ఫంక్షన్స్ లో మీరు గోటాపట్టి పెండెంట్ ను బ్లౌజ్ కు పెట్టించుకుంటే స్పెషల్ అట్రాక్షన్ మీరే .