ఆంధ్ర స్టైల్ హెల్తి టమాటో నిల్వ పచ్చడి.. 10 నిమిషాల్లోనే రెడీ చేసుకోండి..

Dharmaraju Dhurishetty
Dec 28,2024
';

చాలామంది షాపుల్లో లభించే టమాటో నిల్వ పచ్చడిని ఎక్కువగా కొనుగోలు చేసి తింటున్నారు. ఇలా ఎక్కువ రోజును నిల్వ చేసిన పచ్చడి తింటే అనేక అనారోగ్య సమస్యలు రావచ్చు.

';

ఈ టమాటో నిల్వ పచ్చడిని ఇంట్లో కూడా ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లోనే ఎంతో సులభంగా ఈ పచ్చడిని తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

టమాటో నిల్వ పచ్చడి తయారీ విధానం, కావలసిన పదార్థాలు:

';

కావలసిన పదార్థాలు: టమాటాలు - 1 కిలో, చింతపండు - 150 గ్రాములు, ఉప్పు - 250 గ్రాములు, కారం - 150 గ్రాములు, నూనె - 250 గ్రాములు

';

కావలసిన పదార్థాలు: ఆవాలు - 50 గ్రాములు, మెంతి పొడి - 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి - 15 రెబ్బలు, కరివేపాకు - కొద్దిగా

';

తయారీ విధానం: ముందుగా ఈ టమాటో పచ్చడిని తయారు చేసుకోవడానికి టమాటోలను తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.

';

శుభ్రం చేసుకున్న టమాటోలను తడిపోయేంతవరకు ఒక కాటన్ గుడ్డలో వేసి బాగా తుడుచుకోండి. ఇలా తుడుచుకున్న తర్వాత వాటిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి.

';

టమాటో ముక్కలను కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత.. ఒక బౌల్ తీసుకొని అందులో చింతపండును వేసుకొని బాగా నానబెట్టుకోండి.

';

ఇలా నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జును తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఓ మందపాటి గిన్నెలో నూనె వేసుకొని స్టవ్ పై పెట్టుకొని వేడి చేసుకోండి.

';

ఇలా వేడి చేసుకున్న నూనెలో అన్ని రకాల పోపు దినుసులు వేసుకొని బాగా వేపుకోవాల్సి ఉంటుంది. ఇలా వేపుకున్న తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా బాగా వేయించుకున్న తర్వాత టమాటో ముక్కలు చింతపండు గుజ్జు వేసుకొని మరికొద్ది సేపు బాగా వేయించుకోండి. మూత పెట్టి పది నుంచి 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి.

';

ఈ గుజ్జు బాగా ఉడికిన తర్వాత ఉప్పు, కారం, మెంతి పొడి వేసి బాగా కలిపి.. నూనె పైకి తేలేంతవరకు ఉడికించుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా ఉడికిన మిశ్రమాన్ని ఓ 20 నిమిషాల పాటు పక్కన పెట్టి.. బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోండి.. అంతే టమాటో నిల్వ పచ్చడి రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story