అద్భుత ప్రయోజనాలు

తులసి ఆకుతో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.

';

వైద్యంలో

తులసిని హోలీ బాసిల్ అని కూడా పిలుస్తారు. వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం ఇది ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా పరిగణించబడుతుంది.

';

వ్యాధులు రాకుండా

తులసి ఆకులు తింటే రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది. తులసి జలుబు, ఫ్లూ, జ్వరం, అంటువ్యాధుల వంటి సాధారణ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది.

';

శ్వాసకోశ వ్యాధులు

తులసి ఆస్తమా, బ్రోన్కైటిస్, అలెర్జీల వంటి అనేక శ్వాసకోశ వ్యాధుల నివారణకు సహాయ పడుతుంది.

';

జీర్ణక్రియ

తులసిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు జీర్ణక్రియకు సహాయ పడతాయి. అజీర్తి సమస్య తొలగుతుంది.

';

నోటి దుర్వాసన

తులసి ఆకులు నమిలితే నోటి వాసన రాదు. తులసి దంతాలు, చిగుళ్లను బలోపేతం చేయడానికి దోహదం చేస్తుంది.

';

రక్తపోటు

తులసి బీపీని కూడా తగ్గిస్తుంది. రోజు చాయ్‌లో కానీ నీటిలో కానీ తులసి ఆకులు వేసుకుని తాగితే రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది.

';

ఒత్తిడి

ఒత్తిడిని తగ్గించే శక్తి తులసి సొంతం. ఒత్తిడి స్థాయిని తగ్గించడంలో తులసి ఆకులు సహాయ పడుతాయి.

';

చర్మ సంబంధిత

చర్మ సౌందర్యానికి కూడా తులసి దోహదం చేస్తుంది. యాంటీ బాక్టీరియల్ హెర్బ్‌గా పనిచేస్తుంది. మొటిమల వంటి చర్మ సంబంధిత సమస్యల చికిత్సలో సహాయ పడుతుంది.

';

రెండు ఆకులను తింటే

పవిత్ర మొక్కగా భావించే తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. నిత్యం ఈ చెట్టు పూజించడంతోపాటు రెండు ఆకులను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.

';

VIEW ALL

Read Next Story