రూపాయి ఖర్చు లేకుండా దీనితో తెల్ల జుట్టుకు చెక్‌..

Dharmaraju Dhurishetty
Jul 23,2024
';

చిన్న వయస్సుల్లోనే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

';

ముఖ్యంగా తెల్ల జుట్టు ఉన్నవారు ఒత్తిడిని నియంత్రించుకోవాల్సి ఉంటుంది.

';

అలాగే ఈ తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ వినియోగించడం మానుకోవాల్సి ఉంటుంది.

';

ముఖ్యంగా ఈ సమస్యతో బాధపడేవారు కొన్ని రకాల హోమ్ రెమెడీస్‌ వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

కాఫీతో తయారు చేసిన హెయిర్‌ ఫేస్‌ ఫ్యాక్‌ను తెల్ల జుట్టుకు అప్లే చేయడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు.

';

మీరు కూడా తెల్ల జుట్టుకు కాఫీ హెయిర్‌ ఫేస్‌ ఫ్యాక్‌ను వినియోగించాలనుకుంటున్నారా? ఇలా తయారు చేసుకోండి.

';

కాఫీతో తెల్ల జుట్టు రెమెడీకి కావాల్సిన పదార్థాలు: 2 టేబుల్ స్పూన్లు కాఫీ పొడి, 2 గ్లాసుల నీరు, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్

';

తయారీ విధానం: ఒక గిన్నెలో నీరు పోసి స్టవ్‌పై పెట్టి మరిగించాలి. ఇందులోనే కాఫీ పొడి వేసి 10-12 నిమిషాలు పాటు మరిగించాలి.

';

స్టవ్ ఆఫ్ చేసి, కాఫీ డికాక్షన్‌ను చల్లార్చడానికి ఫిల్టర్ చేసుకోవాలి.

';

చల్లారిన కాఫీ డికాక్షన్‌లో కార్న్ ఫ్లోర్ వేసి, ఉండలు లేకుండా కలిపి మళ్లీ స్టవ్‌పై పెట్టి, దగ్గర పడే వరకు ఉడికించాలి.

';

ఈ మిశ్రమాన్ని చల్లార్చిన తర్వాత హెన్నా పౌడర్ వేసి బాగా కలపాలి.

';

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

';

గంట తర్వాత మైల్డ్ షాంపూతో జుట్టును శుభ్రంగా చేసుకోవాల్సి ఉంటుంది.

';

వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే, తెల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది.

';

VIEW ALL

Read Next Story