మహిళలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
ఆకుకూరల్లో ఐరన్, కాల్షియం, విటమిన్ ఎ,సి పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకల ఆరోగ్యాన్ని, ఇమ్యూనిటిని మెరుగుపరుస్తుంది.
బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వాపును తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
సాల్మన్ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. సాల్మన్ చేపలను రెగ్యులర్ గా తిన్నట్లయితే గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటాయి.
గ్రీకు పెరుగులో ప్రొటీన్, ప్రోబయెటిక్స్ పుష్కలంగా ఉన్నాయి. నిత్యం డైట్లో చేర్చుకోవాలి.
పప్పులో ఫైబర్, ప్రొటీన్ తోపాటు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని నిత్యం ఆహారంలో తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.
స్వీట్ పొటాటోలో విటమిన్ ఎ, సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.