ఆషాడ మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం రోజును ఆడి కృత్తిక అంటాము. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ప్రత్యేకం.
ఈ సంవత్సరం..కృత్తికా నక్షత్రం జులై 29వ తేదీ సోమవారం ఉదయం 10 :57 నిమిషాలకు మొదలవుతోంది. ఇక ఆ తరువాత జులై 30వ తేదీ మంగళవారం ఉదయం 10: 22 నిమిషాల వరకు ఈ నక్షత్రం ఉంటుంది.
సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ఈరోజు చాలా విశిష్టమైనది. ఈరోజు సుబ్రహ్మణ్యస్వామికి పూజ చేసి.. పిండి దీపం పెడితే.. మనం ఏది అనుకున్న జరుగుతుంది.
ఈ రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి.. స్నానం చేసి.. పూజగది శుభ్రం చేసుకుని.. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని గంధం కుంకుమ.. పూలతో అలంకరించాలి.
సుబ్రహ్మణ్యస్వామి పటంతో పాటు.. శివపార్వతుల చిత్రపటాలను కూడా పూజ చేయడం మంచిది. సుబ్రహ్మణ్యస్వామికి ఎరుపు రంగు అంతే చాలా ఇష్టం. అందుకే ఆయనకి ఎర్ర పూలు, ఎర్ర చందనం సమర్పిస్తే ఈరోజు మరింత మంచి జరుగుతుంది.
ఇంట్లో మడిగా తయారు చేసుకున్న బియ్యం పిండి. ఆవు నెయ్యి, బెల్లం తో తయారు చేసిన చలిమిడితో ఈరోజున సుబ్రహ్మణ్యస్వామికి ఐదు ప్రమిదలు తయారు చేసుకొని.. అందులో రెండేసి వత్తులు వేసి.. నెయ్యి పోసి దీపారాధన చేయాలి.
అలానే సుబ్రహ్మణ్యస్వామి అష్టోత్తరం చదువుకొని.. ఈరోజు ఒక్కపొద్దు ఉన్నట్టయితే.. ఎంతో మంచి జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరి నమ్మకం. ముఖ్యంగా పిల్లల విషయంలో.. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం ఎంతో మేలు కలిగిస్తుంది.