AP Corona Update: ఏపీలో కొత్తగా 1,501 కరోనా కేసులు, 10 మరణాలు

AP Corona Update: ఏపీలో కొత్తగా 1,501 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు వెల్లడించారు. తాజాగా వైరస్ తో 10 మంది మరణించారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 19, 2021, 06:28 PM IST
  • ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • కొత్తగా 1,501 కరోనా కేసులు నమోదు
  • తాజాగా వైరస్ తో 10 మంది మృతి
AP Corona Update: ఏపీలో కొత్తగా 1,501 కరోనా కేసులు, 10 మరణాలు

Andhra Pradesh: ఏపీలో గడిచిన 24 గంటల్లో  67,716 పరీక్షలు నిర్వహించగా.. 1,501 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ప్రస్తుత కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,98,603 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.  

తాజాగా కొవిడ్‌(Covid) వల్ల 10 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,696కి చేరింది. కరోనా(Corona)తో కృష్ణాలో ముగ్గురు మృతి చెందారు. చిత్తూరు, తూర్పు గోదావరి, నెల్లూరులో ఇద్దరు చొప్పున మృతి చెందారు. కరోనాతో విశాఖలో ఒకరు చనిపోయారు. 

Also Read:  India Corona update: దేశంలో పెరిగిన కరోనా కేసులు... నమోదైన 36,401 కేసులు

జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల(Covid Positive Cases) వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 21, చిత్తూరు జిల్లాలో 174, తూర్పుగోదావరి జిల్లాలో 315, గుంటూరు జిల్లాలో 141, కడప జిల్లాలో 49, కృష్ణాజిల్లాలో 147, కర్నూలు జిల్లాలో 10, నెల్లూరు జిల్లాలో 242, ప్రకాశం జిల్లాలో 107, శ్రీకాకుళం జిల్లాలో 30, విశాఖపట్నం జిల్లాలో 123, విజయనగరం జిల్లాలో 06, పశ్చిమగోదావరి జిల్లాలో 150 పాజిటివ్ కేసులు మోదయ్యాయి.

24 గంటల వ్యవధిలో 1,697 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,69,169కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది.  ప్రస్తుతం ఏపీలో 15,738 యాక్టివ్‌(Active Cases) కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,59,03,366 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News