Andhra Pradesh: ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి నలుగురి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

Crime news: అనంతపురం జిల్లాలో  ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి... నలుగురు దుర్మరణం చెందారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : May 28, 2022, 08:45 AM IST
Andhra Pradesh: ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి నలుగురి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

Gas cylinder blast in anatapur district: అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సెట్టూరు మండలం ములకలేడు గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ... నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సిలిండర్ పేలుడు (Gas cylinder blast) ధాటికి ఇంటి పైకప్పు కూడా కుప్పకూలింది. ఈ ఘటన తెల్లవారుజామున 5 గంటల సమయంలో చోటు చేసుకుంది. మృతులంతా ఒకే ముస్లిం కుటుంబానికి చెందినవారు. భారీ శబ్దం రావడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘోర దుర్ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని...శిథిలాల కింద చిక్కుకున్న ఆరుగురిని బయటకు తీశారు. అందులో నలుగురు మరణించగా..మరో ఇద్దరికీ తీవ్ర గాయలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  గాయాలైన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు ఫిర్దోజ్(6), జైనుబి(60), దాదు(35), షర్ఫున(30)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. 

Also Read: TDP MAHANADU: మహానాడులో ప్రధాని మోడీపై చంద్రబాబు హాట్ కామెంట్స్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News