Anantapur: కలెక్టర్ ఇంటి వద్ద మాజీ భార్య ధర్నా

అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు (Anantapur Collector Gandham Chandrudu) ఇంటి ఎదుట ఆయన మొదటి భార్య సుజాత ధర్నా చేస్తున్నారు. తనకు ఇప్పటివరకూ న్యాయం జరగలేదని సుజాత ఆరోపిస్తూ కలెక్టర్ ఇంటి ఎదుట ధర్నాకు దిగారు.

Last Updated : Oct 8, 2020, 09:39 AM IST
Anantapur: కలెక్టర్ ఇంటి వద్ద మాజీ భార్య ధర్నా

(Anantapur) అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు (Anantapur Collector Gandham Chandrudu) ఇంటి ఎదుట ఆయన మొదటి భార్య సుజాత ధర్నా చేస్తున్నారు. తనకు న్యాయం చేయకుండానే కలెక్టర్ రెండో వివాహం చేసుకున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం అనంతపురం (Anantapur) జిల్లా కలెక్టర్ చంద్రుడు (Gandham Chandrudu) నివాసం ఎదుట మాజీ భార్య సుజాత బైఠాయించారు.

విషయం సామాన్య వ్యక్తిది కాకపోవడంతో జరిగిన విషయాన్ని తెలుసుకునేందుకు కలెక్టర్ బంగ్లా లోనికి మీడియాను సైతం పోలీసులు అనుమతించడం లేదు. మరోవైపు న్యాయం కావాలంటూ మొదటి భార్య సుజాత తన నివాసం వద్ద ధర్నా చేస్తూ ఉండటంతో కలెక్టర్ చంద్రుడు ఇంటికి రావడం లేదని సమాచారం. ఎలాగైనా సరే సమస్య నుంచి బయట పడేందుకు కలెక్టర్ చంద్రుడు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల ద్వారా మొదటి భార్య సుజాతతో అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు రాజీ కుదిర్చే ప్రయత్నాల చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News