JC, Paritala greet each other: ఒక్కటైన జేసీ, పరిటాల కుటుంబాలు

JC Diwakar reddy hugging Paritala sriram : పరిటాల శ్రీరామ్, జేసీ ప్రభాకర్‌‌ రెడ్డి ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఆలింగనం చేసుకున్నారు. సరదాగా మాట్లాడుకున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 10, 2021, 06:00 PM IST
  • అనంత రాజకీయాల్లో అనూహ్య మార్పులు
  • కలిసి పోయిన జేసీ, పరిటాల కుటుంబాలు
  • శ్రీరామ్‌ను ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి
JC, Paritala greet each other: ఒక్కటైన జేసీ, పరిటాల కుటుంబాలు

Anantapur politics changed JC Prabhakar Reddy and Paritala Sriram greet each other : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబానికి (Paritala family) జేసీ కుటుంబాల మధ్య ఏళ్ల తరబడి వైరం ఉంది. వారికి రాజకీయ పరంగానే కాదు కుటుంబాల మధ్య కూడా వ్యక్తిగత ఫ్యాక్షన్ ఉండేది. గతంలో జేసీ బ్రదర్స్ (JC Brothers) కాంగ్రెస్ లో.. పరిటాల కుటుంబం టీడీపీలో ఉండేది. ఇప్పుడు జేసీ, పరిటాల కుటుంబాలు టీడీపీలోనే ఉంటున్నాయి. 

అయినా కూడా ఈ రెండు కుటుంబాల మధ్య వైరం అలాగే ఉండేది. వారి కుటుంబాల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమనేది. కానీ ఉన్నట్లుండి ఏమైందో ఏమో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇరు కుటుంబాల మధ్య కక్షలు కార్పణ్యాలు మాసిపోయాయా అనిపిస్తోంది. స్నేహితులై పోయారా అని అందరూ అనుకుంటున్నారు. 

మాజీ మంత్రి పరిటాల సునీత.. (Paritala Sunita) దివంగత నేత పరిటాల రవి (Paritala Ravi) కుమారుడు పరిటాల శ్రీరామ్ ను జేసీ కౌగలించుకోవడం ఇప్పుడు అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. పరిటాల శ్రీరామ్, జేసీ ప్రభాకర్‌‌ రెడ్డి ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఆలింగనం చేసుకున్నారు. సరదాగా మాట్లాడుకున్నారు.

ఒకప్పుడు అనంత జిల్లాలో పరిటాల, జేసీ కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఓ రేంజ్‌లో హైవోల్టేజ్‌ రాజకీయాలుండేవి. కానీ పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా.. మనుషుల్లో మార్పులు సహజమే.ఇప్పుడు ఈ రెండు కుటుంబాల మధ్య పాత గొడవలన్నీ సమసిపోయాయి అనిపిస్తోంది. రెండు కుటుంబాలు ఒకే పార్టీలో ఉన్నాయి.

Also Read : AP-Odisha Border Issue: ఆ పదహారు గ్రామాల పయనం ఎటు, ఏపీలోనా లేదా ఒడిశాలోనా

నారా లోకేష్ (Nara Lokesh) అనంతపురం పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం చెప్పడానికి ఆ పార్టీ నేతలంతా వచ్చారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి.. పరిటాల శ్రీరామ్ ఆత్మీయ పలకరింపు కూడా చర్చకు వచ్చింది.హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా నారా లోకేష్ అనంతపురం వెళ్లారు. అనంతపురంలోకి ఎంటరయ్యే సమయంలో ఆ జిల్లాకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ముందుగా జేసీ వర్గం వచ్చింది.. తరువాత కొంతసేపటికి పరిటాల శ్రీరామ్ (Paritala Shriram) వచ్చారు. ఈ క్రమంలో పరిటాల శ్రీరామ్‌ను జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు. పరిటాల శ్రీరామ్ కూడా ఆప్యాయంగా మాట్లాడారు. జేసీ, పరిటాల (Paritala) కుటుంబాల మధ్య ఏర్పడిన ఈ అనూహ్య బంధంపై టీడీపీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read : Bay of Bengal: బంగాళాఖాతంలో వాయుగుండం, ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక జారీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News