AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో రెండో భాషగా ఉర్దూ..

AP Cabinet: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఉర్దూను రెండో భాషగా గుర్తిస్తూ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 7, 2022, 06:32 PM IST
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో రెండో భాషగా ఉర్దూ..

AP Assembly budget session 2022: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏపీ కేబినెట్ (AP Cabinet) పలు కీలక చట్టాల సవరణలకు ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉర్దూను (Urdu Language) రెండో భాషగా గుర్తిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా చ‌ట్టం 1966కు స‌వ‌ర‌ణకు  ఆమోదం తెలిపింది. అదేవిధంగా విదేశీ మద్యం నియంత్రణ చట్టం, హిందూ ధార్మిక సంస్థల చట్టం, తితిదేలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం కోసం చట్ట సవరణలకు ఏపీ కేబినెట్ ఆంగీకారం తెలిపింది. 

రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో (AP Assembly budget session 2022) భాగంగా .. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఏపీ కేబినెట్ (AP Cabinet) సమావేశంలో 35 అజెండా అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా శాసనసభలో ప్రవేశపెట్టిన ప‌లు బిల్లుల‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లుకు ఆమోదం లభించింది.  నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు ₹8,741 కోట్ల రుణ సమీకరణకు ఏపీ మారిటైం బోర్డుకు హామీ ఉండేందుకు రాష్ట్ర కేబినెట్ ఆంగీకారం తెలిపింది. 

Also Read: AP Governor Address: అభివృద్ధి దిశగా ఏపీ పయనం, గవర్నర్ ప్రసంగంలో కీలకాంశాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News