AP High Court: మద్యం ప్రియులకు ఉపశమనం.. మూడు బాటిళ్లు తెచ్చుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్‌( Andhra Pradesh ) లో మద్యం ధరలు అధికంగా ఉండటంతో.. మద్యం ప్రియులు సరిహద్దుకు దగ్గరగా ఉన్న వేరే రాష్ట్రాలను ఆశ్రయిస్తున్నారు. ఇదిలాఉంటే.. అడ్డదారిలో ఇప్పుడే లక్షలు సంపాదించుకోవచ్చన్న దుర్భుద్దితో చాలా మంది దళారి వ్యాపారులు అక్రమంగా వేరే రాష్ట్రాల నుంచి భారీగా మద్యం బాటిళ్ల ( Illicit Liquor ) ను ఏపీకి తరలిస్తున్నారు.

Last Updated : Sep 2, 2020, 12:39 PM IST
AP High Court: మద్యం ప్రియులకు ఉపశమనం.. మూడు బాటిళ్లు తెచ్చుకోవచ్చు

other states 3 wine bottles permitted in AP: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌( Andhra Pradesh ) లో మద్యం ధరలు అధికంగా ఉండటంతో.. మద్యం ప్రియులు సరిహద్దుకు దగ్గరగా ఉన్న వేరే రాష్ట్రాలను ఆశ్రయిస్తున్నారు. ఇదిలాఉంటే.. అడ్డదారిలో ఇప్పుడే లక్షలు సంపాదించుకోవచ్చన్న దుర్భుద్దితో చాలా మంది దళారి వ్యాపారులు అక్రమంగా వేరే రాష్ట్రాల నుంచి భారీగా మద్యం బాటిళ్ల ( Illicit Liquor ) ను ఏపీకి తరలిస్తున్నారు. ఈ క్రమంలో లాక్‌డౌన్ నాటినుంచి కోట్లాది రూపాయల మద్యాన్ని ఏపీ పోలీసులు ఇప్పటికీ పట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఏపీ హైకోర్టు (AP high court )  బుధవారం కీలక తీర్పునిచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తీసుకువచ్చే వ్యక్తులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. Also read: Pramod Sawant: గోవా ముఖ్యమంత్రికి కరోనా

ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తీసుకుని వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ ఏపీ పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ రిట్ పిటిషన్ దాఖలు కాగా.. ఉన్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది. దీనిపై వాదనలు విన్న హైకోర్టు ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం సీసాలు తీసుకురావచ్చని తీర్పును వెలువరించింది. ఈ మేరకు జీవో 411 అమలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. Also read: Parliament session: ప్ర‌శ్నోత్త‌రాలు లేకుండానే పార్ల‌మెంట్‌

Trending News