సీఆర్‌డీఏ సవరణ బిల్లు సహా ఆరు బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

అమరావతి: ఏపీ అసెంబ్లీ బుధవారం సీఆర్‌డీఏ సహా పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది.

Last Updated : Dec 2, 2017, 01:17 PM IST
సీఆర్‌డీఏ సవరణ బిల్లు సహా ఆరు బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

అమరావతి: సీఆర్‌డీఏ సవరణ బిల్లుతో సహా ఆరు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గ్రీన్ ట్రిబ్యూనల్ అభ్యంతరాల నేపథ్యంలో సీఆర్‌డీఏ చట్టంలో కొన్ని సవరణలు చేసిన బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆన్‌లైన్ లేఅవుట్ల కోసం ఏపీ మున్సిపాలిటీల సవరణ బిల్లును సభ ఆమోదించింది. అలాగే ఏపీ న్యాయవాదుల సంక్షేమ నిధి సవరణ బిల్లు, ఏపీ నివాస, నివాసేతర ప్రాంగణాల అద్దెలకు సంబంధించిన సవరణ బిల్లు, ఏపీ పంచాయితీ రాజ్ సవరణ బిల్లు, నాలా చట్టం సవరణ బిల్లు లాంటి కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. సభలో ప్రతిపక్షం లేకపోవడంతో బిల్లు ఆమోద ప్రక్రియ సులువుగా జరిగిపోయింది. 

 

Trending News