CM Jagan Class To MLAS: సీఎం జగన్ ను లైట్ తీసుకుంటున్న ఎమ్మెల్యేలు... ఓటమి ఖాయమని డిసైడ్ అయ్యారా?

CM Jagan: ప్రాంతీయ పార్టీలలో అధినేతే సుప్రీమ్. ఆయన మాటే పార్టీ నేతలకు వేదం. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీల్లోనే ఇదే కనిపిస్తుంది. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి ఉన్నా అంతా ఏకపక్ష పాలనే అన్న విమర్శలు ఉన్నాయి.ఏపీ సీఎం జగన్ కు ఎవరిమాట వినని సీతయ్య అనే టాక్ ఉంది

Written by - Srisailam | Last Updated : Jun 9, 2022, 10:08 AM IST
  • జగన్ ఆదేశాలు పట్టించుకోని ఎమ్మెల్యేలు
  • గడపగడపకు ప్రభుత్వానికి డుమ్మా
  • వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై చర్చ
CM Jagan Class To MLAS: సీఎం జగన్ ను లైట్ తీసుకుంటున్న ఎమ్మెల్యేలు... ఓటమి ఖాయమని డిసైడ్ అయ్యారా?

CM Jagan: ప్రాంతీయ పార్టీలలో అధినేతే సుప్రీమ్. ఆయన మాటే పార్టీ నేతలకు వేదం. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీల్లోనే ఇదే కనిపిస్తుంది. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి ఉన్నా అంతా ఏకపక్ష పాలనే అన్న విమర్శలు ఉన్నాయి. తెలంగాణలో కేసీఆర్, బెంగాల్ లో మమతా బెనర్జీ, ఢిల్లీలో కేజ్రీవాల్ అంతా సేమ్ సీన్. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది మరో పరిస్థితి. ఏపీ సీఎం జగన్ కు ఎవరిమాట వినని సీతయ్య అనే టాక్ ఉంది. వైసీపీలో జగన్ మాట వినకపోతే.. ఆ నాయకుడి పరిస్థితి అంతే అన్న ప్రచారం ఉంది. గత మూడేళ్లుగా జగన్ పాలన చూస్తున్నవాళ్లు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. సీనియర్లను పక్కనపెట్టి జూనియర్లకు కేబినెట్ లోకి తీసుకోవడం.. మూడేళ్ల తర్వాత మెజార్టీ మంత్రులను మార్చడం.. ఇవన్ని జగన్ మోనార్కిజానికి నిదర్శమనే టాక్ ఉంది.

అంతాతానై వ్యవహరించే సీఎం జగన్ .. పార్టీపై క్రమంగా పట్టు కోల్పోతున్నారా? ఆయన మాటలను పార్టీ నేతలు పట్టించుకోవడం లేదా? అన్న అనుమానాలు కొన్ని రోజులుగా వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో, పార్టీలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అలానే కనిపిస్తున్నాయి. సీఎం జగన్ ఆదేశాలను కొందరు వైసీపీ నేతలు లైట్ తీసుకుంటున్నారనే చర్చ సాగుతోంది. తాజాగా పార్టీ నేతలతో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వర్క్ షాప్ లోనే ఈ విషయం బహిర్గతమైంది. తన ఆదేశాలను పట్టించుకోవడం లేదంటూ పార్టీ నేతలపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడం వైసీపీలో కలకలం రేపుతోంది.

గత నెలలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది వైసీపీ. ప్రజా ప్రతినిధులంతో ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించాలని ఆదేశించారు సీఎం జగన్. ఈ కార్యక్రమాన్ని ఏపీ సీఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ నేతలంతా ఖచ్చితంగా జనాల్లోకి వెళ్లాలని ఆదేశించారు. అయినా గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం చప్పగానే సాగింది. మే11న కార్యక్రమం మొదలైంది.. దాదాపు నెలరోజులైంది. అయితే ఇప్పటివరకు ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కరోజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఇందులో మాజీ మంత్రులు ఆళ్ల నాని, అనిల్ కుమార్ యాదవ్, రామిరెడ్డి ప్రతాపరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వసంతకృష్ణ ప్రసాద్, శిల్పా చక్రపాణి రెడ్డి ఉన్నారు. మరో 65 మంది ఎమ్మెల్యేలు 10 రోజుల లోపే జనంలోకి వెళ్లారు. 20 రోజులకు పైగా గడపగడపకు కార్యక్రమం నిర్వహించిన వాళ్లు 10 లోపే. ప్రభుత్వ చీఫ్‌ విప్‌, నర్సాపురం ఎమ్మెల్యే  ప్రసాదరాజు 21 రోజులు తిరగగా.. కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ 20 రోజులు జనంలోకి వెళ్లారు.  

గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యే పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షలు తెప్పించుకున్నారు సీఎం జగన్. ఆ వివరాలను వర్క్ షాపులో బయటపెట్టారు. ఈ లెక్కలే ఇప్పుడు వైసీపీని షేక్ చేస్తున్నాయి. సీఎం జగన్ సీరియస్ గా ఆదేశించినా.. దాదాపు వంద మంది ఎమ్మెల్యేలు జనంలోకి సరిగా వెళ్లకపోవడం చర్చగా మారింది. ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక్కరోజు కూడా పాల్గొనకపోవడం విస్మయపరుస్తోంది. జగన్ కు వీర విధేయులుగా చెప్పుకునే మాజీ మంత్రులు ఆళ్ల నాని, అనిల్ కుమార్ యాదవ్ లు ఒక్కరోజు కూడా జనంలోకి వెళ్లకపోవడం చర్చగా మారింది.జగన్ చెప్పినా వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు పట్టించుకోవడం లేదన్నదానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత భారీగా ఉందని గ్రహించిన ఎమ్మెల్యేలు ముందే జాగ్రత్తలు పడుతున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమనే నిర్ణయానికి వచ్చిన ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకుంటున్నారని.. అందుకే జగన్ ఆదేశాలను పట్టించుకోవడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజలు తిరగబడతారనే భయంతో మరికొందరు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని చెబుతున్నారు. మొత్తంగా సీతయ్యగా చెప్పుకునే సీఎం జగన్ మాటలను వైసీపీ ఎమ్మెల్యేలు లైట్ తీసుకోవడం చిన్న విషయం కాదనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీకి ఇది డేంజర్ సిగ్నలే అంటున్నారు.  

READ ALSO: Pawan Kalyan: పొత్తులపై పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్.. జనసేనాని దారెటు?

READ ALSO: TSRTC Hikes Diesel Cess: భారీగా డీజిల్ సెస్ పెంపుతో ప్రయాణికులకు మళ్లీ షాక్ ఇచ్చిన టిఎస్ఆర్టీసీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News