Ap Government: జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఫెయిల్ అయినా మళ్లీ పదో తరగతిలో చేరవచ్చు

Ap Government: విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బడీ వయస్సు పిల్లలు బడిలోనే ఉండే అవకాశం కల్పిస్తోంది. ఫెయిలైనా సరే పదో తరగతి కొనసాగించవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 16, 2023, 06:44 PM IST
Ap Government: జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఫెయిల్ అయినా మళ్లీ పదో తరగతిలో చేరవచ్చు

Ap Government: ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త నిర్ణయంతో పదవ తరగతి ఫెయిల్ విద్యార్ధులకు గొప్ప అవకాశం కల్పిస్తున్నారు. అంటే ఇకపై పదో తరగతి పబ్లిక్ అయినా సరే పాసయ్యేంతవరకూ స్కూళ్లో కొనసాగవచ్చు.

పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు పబ్లిక్. ఈ రెండు పరీక్షలు ఫెయిల్ అయితే ఇక తిరిగి స్కూల్ లేదా కళాశాలలో కొనసాగే అవకాశముండదు. చాలామంది బహుశా అందుకే పదవ తరగతి ఫెయిల్ అయ్యాక తిరిగి చదువు కొనసాగించడం లేదు. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. ఇకపై పదవ తరగతి లేదా ఇంటర్ ఫెయిల్ అయినా సరే తిరిగి అదే స్కూల్ లేదా కళాశాలలో చేరి చదువు కొనసాగించవచ్చు. అంటే రీ అడ్మిషన్ విధానంలో ఈ వెసులుబాటు కలుగుతుంది. మొన్నటివరకైతే పదవ తరగతి లేదగా ఇంటర్ ఫెయిల్ అయితే సప్లిమెంటరీ లేదా మరుసటి ఏడాది పరీక్షలు రాయాల్సి వచ్చేది. 

అంటే తిరిగి స్కూల్ లేదా కళాశాలకు వెళ్లి చదువుకునే అవకాశం ఉండేది కాదు. దాంతో చాలామంది మొత్తం చదువే మానేసేవారు. ఈ పరిస్థితిని గమనించిన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఫెయిల్ అయినా సరే ప్రభుత్వ పాఠశాలల్లో రీ అడ్మిషన్ అవకాశముంటుంది. ఇలాంటి విద్యార్ధుల్ని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లేదా వాలంటీర్లు గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమం ఇది. గతంలో ఇంటర్మీడియట్‌లో సైతం ఇదే విధానాన్ని అవలంభించింది. 

ప్రభుత్వం తీసుకున్న ఈ విధానం వల్ల ఈ ఏడాది ఏకంగా లక్షా 26 వేలమంది విద్యార్ధులు తిరిగి పాఠశాలల్లో చేరారు. గత ఏడాది పదవ తరగతిలో లక్షా 23 వేల మంది ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కొత్తగా స్కూళ్లలో చేరిన 1 లక్షా 26 వేలమంది విద్యార్ధులు రెగ్యుల్ విద్యార్ధులతో పాటు స్కూల్స్‌కు వెళ్తున్నారు. ఇలా రీ అడ్మిషన్ తీసుకున్నవారికి కూడా అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అందిస్తామని చెబుతోంది ప్రభుత్వం. 

Also read: Chandrababu Case Updates: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుకు మళ్లీ నిరాశ, విచారణ వాయిదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News