Rushikonda Works: రుషికొండ నిర్మాణాలపై సర్వేకు ఏపీ హైకోర్టు ఆదేశాలు

Rushikonda Works: విశాఖపట్నం రుషికొండ నిర్మాణాల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రుషికొండ నిర్మాణాలపై కేంద్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. అసలేం జరిగింది, ఆ ఆదేశాలేంటి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 31, 2023, 09:48 PM IST
Rushikonda Works: రుషికొండ నిర్మాణాలపై సర్వేకు ఏపీ హైకోర్టు ఆదేశాలు

Rushikonda Works: విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత విశాఖలోని రుషికొండపై కీలకమైన నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఈ నిర్మాణాలపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మరోసారి ఏపీ హైకోర్టు ఈ విషయంలో కలగజేసుకుంది. 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలో విశాఖపట్నం కేంద్రంగా పాలన ప్రారంభించనున్నారు. త్వరలో ఆయనతో పాటు సీఎంవో కార్యాలయం కూడా విశాఖకు మారనుంది. ఈ నేపధ్యంలో విశాఖపట్నంలోని రుషికొండపై సీఎం ఇళ్లు, క్యాంప్ ఆఫీసు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కొండను తొలిచే కార్యక్రమం చేపట్టడంతో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షం టీడీపీ సహా చాలామంది కోర్టును ఆశ్రయించారు. కొంతమంది గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తరువాత రుషికొండలో కేవలం 9.88 ఎకరాల్లోనే నిర్మాణాలకు అనుమతులు లభించాయి. అయితే అనుమతించిన దానికంటే ఎక్కువగా 20 ఎకరాల్లో తవ్వకాలు జరుగుతున్నాయంటూ పిటీషన్లు దాఖలయ్యాయి. 

ఈ పిటీషన్లపై విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం అదనంగా 3 ఎకరాల్లోనే తవ్వకాలు చేపట్టినట్టు తెలిపింది. అయితే పిటీషనర్ మాత్రం 20 ఎకరాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయంటూ ఆరోపించాడు. ఈ క్రమంలో గతంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రుషికొండలో సర్వే నిర్వహించింది. ఇప్పుడు మరోసారి ఏపీ హైకోర్టు ఈ వ్యవహారంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. రుషికొండలో జరుగుతున్న నిర్మాణాల్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవల్సిందిగా కేంద్రానికి సూచించింది. ఈ వ్యవహారంపై 3 వారాల్లో నివేదిక సమర్పించాలని ఏపీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఏపీ హైకోర్టు ఆదేశాల నేపధ్యంలో కేంద్ర అటవీ శాఖ మరోసారి పరిశీలన జరపనుంది. త్వరలో విశాఖకు మకాం మార్చనున్నట్టు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన నేపధ్యంలో అక్కడ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు రుషికొండ నిర్మాణాల పరిశీలనకు ఆదేశాలివ్వడం ఆసక్తి రేపుతోంది. 

Also read: Ap Liquor Scam: చంద్రబాబుపై మద్యం కుంభకోణం కేసు, ఢిల్లీ లిక్కర్ స్కాంకు మించిందంటున్న సీఐడీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News