తెలుగు పదాన్ని ఖూనీ చేసిన "భాషా సాంస్కృతిక శాఖ"

ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ అధికారుల నిర్లక్ష్యం ఆ రోజు కొట్టొచ్చిన్నట్లు కనిపించింది.

Last Updated : Jul 9, 2018, 09:39 PM IST
తెలుగు పదాన్ని ఖూనీ చేసిన "భాషా సాంస్కృతిక శాఖ"

ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ అధికారుల నిర్లక్ష్యం ఆ రోజు కొట్టొచ్చిన్నట్లు కనిపించింది. ప్రముఖ కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ 88వ జయంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్యానరు ప్రింటింగ్‌లో జరిగిన అతి పెద్ద తప్పిద్దాన్ని నిర్వాహకులు ఎలా గుర్తించలేకపోయారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

బ్యానరులో  ‘భాషా సాంస్కృతిక శాఖ’ అని రాయించాల్సిన వారు.. అక్షర దోషాలను పరిశీలించకపోవడం వల్ల "భాసా సాంస్కృతిక శాఖ" అని ముద్రణ జరిగింది. ఎప్పుడైతే ఈ బ్యానర్‌కి సంబంధించిన ఛాయాచిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందో నెటిజన్లు విరుచుకుపడ్డారు. భాషా సాంస్కృతిక శాఖ వారే భాషను పట్టించుకోక పోతే.. ఇతర ఇతర శాఖల వారు ఏం పట్టించుకుంటారని పలువురు ఎద్దేవా చేశారు. 

అయితే ఎప్పుడైతే సోషల్ మీడియాలో సదరు బ్యానర్ వైరల్ అయ్యిందో.. నిర్వహకులు ఆయా ప్రదేశం నుండి బ్యానరును తొలిగించినట్లు తెలుస్తోంది. అయితే.. జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. నెటిజన్లు అక్షర దోషాలతో ఉన్న బ్యానరు చూసి స్పందించాల్సిన రీతిలోనే స్పందించారు. ప్రభుత్వ తీరుపై మూకుమ్మడిగా విమర్శలు కూడా చేశారు. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తామని పలువురు అన్నారు.

Trending News