AP Model School Jobs: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త..రాత పరీక్ష లేకుండానే పోస్టుల భర్తీ..!

AP TGt&PGT Recruitment 2022: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ అందింది. ఒప్పంద ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

Written by - Alla Swamy | Last Updated : Aug 9, 2022, 03:50 PM IST
  • ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్
  • రాత పరీక్ష లేకుండా పోస్టుల భర్తీ
  • నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యా శాఖ
AP Model School Jobs: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త..రాత పరీక్ష లేకుండానే పోస్టుల భర్తీ..!

AP TGt&PGT Recruitment 2022: ఏపీ పరిధిలోని ఆదర్శ పాఠశాలల్లో కాంట్రాక్టు బేసిక్ ప్రాతిపదికన టైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(TGT), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్(PGT) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. ఈమేరకు 282 పోస్టుల భర్తీకి ఏపీ పాఠశాల విద్యా శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో టైన్డ్ గ్రాడ్యుయేటర్ టీచర్స్ పోస్టులు 71, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టులు 211 ఉన్నాయి.

పోస్టులను బట్టి ఇంగ్లీష్‌, సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్టీ, బోటనీ వంటి స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ..రెండేళ్ల మాస్టర్ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో పాస్‌ అయ్యి ఉండాలి. వీటితోపాటు సంబంధిత సబ్జెక్ట్‌లో బీఈడీ పూర్తి చేయాలి. ఎంకాం అప్లెడ్, బిజినెస్ ఎకనామిక్స్ సబ్జెక్ట్‌ అర్హత కలిగిన అభ్యర్థులు పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టులకు 44 ఏళ్ల వారు మాత్రమే అర్హులు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 17లోపు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులను జోన్‌ల వారిగా అకడమిక్ మెరిట్, అనుభవంచ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. యూజీ, పీజీ డిగ్రీలో 60 శాతం మార్కులు, బీఈడీకి 10 శాతం, గతంలో ఏపీ మోడల్ స్కూళ్లలో పనిచేసిన వారికి 20 శాతం, టీచింగ్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, టీచింగ్ డెమోకు 10 శాతం వెయిటేజీ ఉంటుందని నోటిఫికేషన్‌లో వెల్లడించారు.

జోన్‌ వన్‌లో 17 టీజీటీ పోస్టులు, జోన్ 3లో 23, జోన్ 4లో 31, జోన్ వన్‌లో 33 పీజీటీ పోస్టులు, జోన్‌ 2లో 4 పోస్టులు ఉన్నాయి. జోన్‌ 3లో పీజీటీ పోస్టు, జోన్‌ 4లో 124 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈనెల 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టు ప్రకటన ఈనెల 23న ఉండనుంది. ఆగస్టు 24 నుంచి 25 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు.

ఈనెల 29న ఇంటర్వ్యూ లిస్టు విడుదల చేస్తారు. వెబ్ కౌన్సిలింగ్ నిర్వహణ నవంబర్  8న జరగనుంది. నవంబర్ 9న అభ్యర్థుల జాయినింగ్ ప్రాసెస్ ఉండనుంది. మరిన్ని వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో చూడాలని విద్యా శాఖ తెలిపింది.

Also read:8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్..ఇప్పట్లో 8వ వేతన సంఘం లేనట్లే..!

Also read:Rain Alert Live Updates: ముంచుకొస్తున్న వాయు'గండం'..తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News