మోడీ సర్కార్ vs ప్రతిపక్షాలు: అవిశ్వాసం పోరులో నెగ్గేదెవరు ?

                            

Last Updated : Jul 19, 2018, 12:53 PM IST
మోడీ సర్కార్ vs ప్రతిపక్షాలు: అవిశ్వాసం పోరులో నెగ్గేదెవరు ?

మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా లోక్‌సభలో పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేలా మద్దతు కూడగట్టడంలో మొత్తానికి టీడీపీ పార్టీ సఫలమైంది.  కేంద్రానికి వ్యతిరేకంగా టీడీడీ ఎంపీ కేశినేని నాని గురువారం సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడం.. అందుకు మద్దతుగా 50 మందికిపైగా విపక్ష సభ్యులు లేచి నిలబడటం చకచకా జరిగిపోయాయి. సభలో 50 మందికిపైగా సభ్యులు మద్దతిస్తున్నందున అవిశ్వాసాన్ని చర్చకు అనుమతిస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. కాగా లోక్ సభ ఆర్డర్ ప్రకారం చూస్తే అవిశ్వాస తీర్మానం శనివారం (రేపు) చర్చకు వచ్చే అవకాశముంది. అవిశ్వాస తీర్మానాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారపక్షం సిద్ధమౌతుండగా..ప్రతిపక్షాలు కూడా అదే స్థాయిలో వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నాయి. దీంతో రేపు జరిగే చర్చపై సరత్రా ఉత్కంఠత నెలకొంది.

సాధ్యసాధ్యాలు ఇవే...

లోక్‌సభ మొత్తం స్థానాలు 545 కాగా ప్రస్తుతం స్పీకర్‌తో కలిసి 536 మంది ఉన్నారు. 9 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే మోడీ ప్రభుత్వానికి మెజార్టీకి ఢోకాలేదు. ఎందుకంటే లోక్ సభలో బీజేపీకి దాదాపు మెజార్టీ స్థానాలు ఉన్నాయి. దీనికి తోడు ఎన్డీయేలో ఉన్న మిత్రపక్షాలన్నీ ( టీడీపీ, పీడీపీ మినహా) మోడీ సర్కార్ కు అండగా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. శివసేన వైఖరి డౌట్ గా ఉన్నప్పటికీ 37 మంది సభ్యులున్న అన్నాడీఎంకే.. మోడీ సర్కార్ కు పక్షాన నిలిచే అవకాశం ఉంది. ఈ లెక్క ప్రకారం చూస్తే మోడీ సర్కార్ కు ధోకా లేదని పిస్తోంది. 

మోడీకి మింగుపడని విషయం
అయితే మోడీ సర్కార్ కు మింగుపడని విషయం ఒకటుంది..అది ప్రతిపక్షాలన్నీ ఏకమవడం. ఒక వేళ ఎన్డీయే పక్షాలన్నీ మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఓటు వేయడమో.. లేదంటే బీజేపీ సభ్యులు గైర్హాజరు అయితే పరిస్థితి మరోలా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే ఇది ఊహాజనితమే..  ఏది ఏమైనాప్పటికీ  ప్రభుత్వాన్ని కూల్చుకపోయినా కనీసం మోడీ సర్కార్ ను ఎండగట్టేందుకు చక్కటి అవకాశంగా ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీకి ఇది బంపర్ ఆఫర్ లాంటిది. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలో గ్రాఫ్ పెంచుకోవాలని టీడీపీ భావిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 

వైసీపీకి నో ఛాన్స్ 
ఇదిలా ఉండగా ఈ సందర్భంలో వైసీపీ పాత్ర లేకపోవడం గమనార్హం. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామా చేసి స్పీకర్ చేత ఆమోదించుకున్నవిషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి అవిశ్వాస తీర్మానంలో పాల్గొనే ఛాన్స్ లేదు . అయితే లోక్‌సభలో నలుగురు ఎంపీలు అధికారికంగా వైసీపీ పేరుతో కొనసాగుతున్నప్పటికీ వారి తీరుమాత్రం వేర్వేరుగా ఉంది. ఇందులో కర్నూలు ఎంపీ బుట్టారేణుక, ఎస్‌పీవైరెడ్డి టీపీపీతో అనుబంధంగా కొనసాగుతున్నందున వారిద్దరూ అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసే అవకాశం ఉంది. అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఏ పార్టీతోనూ లేరు. ఆమె అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటువేసే అవకాశం ఉంది. ఇక తెలంగాణలోని ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ఎస్‌తో కొనసాగుతున్నందున ఆ పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకోనున్నారు.

Trending News