అమరావతిలో చంద్రబాబు యోగాసనాలు..!

చతుర్థ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ కార్యకర్తలు, మంత్రులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా యోగా గురువు పతంజలికి నివాళులు అర్పించారు. 

Last Updated : Jun 21, 2018, 11:28 AM IST
అమరావతిలో చంద్రబాబు యోగాసనాలు..!

చతుర్థ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ కార్యకర్తలు, మంత్రులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా యోగా గురువు పతంజలికి నివాళులు అర్పించారు. ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన యోగా పోటీల్లో విజేతలను ఎంపిక చేసి వారికి బహుమతులు కూడా అందించారు.

ఈ సందర్భంగా సీఎం యోగా ప్రాధాన్యతను తెలిపారు. "మనల్ని మనకు పరిచయం చేసే ఏకైక మార్గం యోగా. శరీరాన్ని, మనస్సును లగ్నం చేసి సాధన చేస్తే సంతోషకర, ఆరోగ్యకర జీవితాన్ని ఆస్వాధించగలం. ఒత్తిడిని జయించి పరిపూర్ణంగా జీవించగలం" అని సోషల్ మీడియా ద్వారా యోగా దినోత్సవ ప్రాధాన్యతను వివరిస్తూ సందేశం ఇచ్చారు. 

"యోగా అనేది ఒక మతానికో దేశానికో సంబంధించింది కాదు.. ఎవరైనా యోగా ద్వారా సత్ఫలితాలు పొందవచ్చు. యోగాను మన జీవన విధానంలో భాగంగా చేసుకోవాలి"అని సోషల్ మీడియా వేదికగా సీఎం తన అభిప్రాయాలను పంచుకున్నారు. 

Trending News