సెల్‌ఫోన్ లోనే అన్ని ప్రభుత్వ సేవలు - చంద్రబాబు

సాంకేతిక రంగంలో కూడా మార్పులు శరవేగంగా వస్తున్నాయని ..దీన్ని అందిపుచ్చుకునేందుకు యువత సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.                                                  

Last Updated : Aug 4, 2018, 07:03 PM IST
సెల్‌ఫోన్ లోనే అన్ని ప్రభుత్వ సేవలు - చంద్రబాబు

సాంకేతిక రంగంలో కూడా మార్పులు శరవేగంగా వస్తు అందిపుచ్చుకునేందుకు యువత సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో సామర్థ్య పెంపుదలే లక్ష్యంగా తిరుపతిలో శనివారం నిర్వహించిన ‘జ్ఞానభేరి’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భవితవ్యం యువత, విద్యార్థుల చేతిలోనే ఉందన్నారు. 

యువత తమ నైపుణ్యాలు పెంపొందించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. యువత సహకారం ఉంటే 2022 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో సెల్ ఫోన్‌లోనే అన్ని ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. 

ఈ సందర్భంగా ప్రతిష్టాత్మక  పోలవరం ప్రాజెక్టు , రాజధాని అమరావతి నిర్మాణాలపై రూపొందించిన లఘచిత్రాలను జ్ఞానభేరి వేదికపై ప్రదర్శించారు. కాగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ విద్యార్థుల జానపద నృత్యాలు, శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ విద్యార్థుల యోగాసనాలు ఆహుతులను అలరించాయి.

Trending News