తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు

తెలుగు రాష్ట్రాల్లో 'కరోనా వైరస్' క్రమక్రమంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు గుబులు పుట్టిస్తున్నాయి.  ఆంధ్రప్రదేశ్ లో మరో 15 కరోనా వైరస్  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలోనూ కేసుల సంఖ్య 404కు పెరిగింది.

Last Updated : Apr 8, 2020, 11:35 AM IST
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు

తెలుగు రాష్ట్రాల్లో 'కరోనా వైరస్' క్రమక్రమంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు గుబులు పుట్టిస్తున్నాయి.  ఆంధ్రప్రదేశ్ లో మరో 15 కరోనా వైరస్  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలోనూ కేసుల సంఖ్య 404కు పెరిగింది.

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 15 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు  నమోదయ్యాయి. తాజాగా ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. నిన్న సాయంత్రం నుంచి 6 గంటల నుంచి ఇవాళ ( బుధవారం) ఉదయం 9 గంటల వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యను ఆరోగ్య శాఖ విడుదల  చేసింది. ఇందులో కొత్తగా నెల్లూరు జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో మూడు కేసులు నమోదైనట్లు వెల్లడించింది. మొత్తం వీటితో కలిపి ఇప్పటి వరకు ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 329కి చేరింది.

అటు తెలంగాణలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 404కు చేరుకుంది. ఇందులో ఇప్పటి వరకు 45 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 11 మంది చనిపోయారు. ప్రస్తుతం 348 మందికి ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. అలాగే ప్రభుత్వ క్వారంటైన్లలో 476 మందిని ఉంచి పరిశీలిస్తున్నారు. ప్రయివేట్ క్వారంటైన్లలో 38 మంది ఉన్నారు. అలాగే ఇళ్లల్లోని క్వారంటైన్లలో 11 వందల 97 మంది ఉన్నారని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News