మాజీ హోం మంత్రిపై క్రిమినల్ కేసు

మాజీ హోం మంత్రిపై క్రిమినల్ కేసు

Last Updated : Sep 10, 2018, 04:18 PM IST
మాజీ హోం మంత్రిపై క్రిమినల్ కేసు

విజయవాడ శివార్లలోని గుంటపల్లి పంచాయతీ కార్యదర్శిని బెదిరించినందుకు ఇబ్రహీం పట్టణం పోలీసులు మాజీ హోం మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వసంత నాగేశ్వరరావుపై కేసు నమోదు చేశారు. గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వసంత నాగేశ్వరరావుపై పోలీసులు క్రిమినల్  కేసు రిజిస్టర్ చేశారు.

గుంటుపల్లిలో ప్లెక్సీల వివాదం దుమారాన్ని రేపుతుండగా, పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసిన వసంత నాగేశ్వరరావు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును హత్య చేస్తామనే రీతిలో ఫోన్ కాల్ ఉండటంతో.. ఆ కాల్‌ని రికార్డు చేసిన పంచాయతీ కార్యదర్శి దాన్ని పోలీసులకు వినిపించారు. ఆ ఆడియోటేప్‌ను ప్రాథమిక సాక్ష్యంగా పరిగణలోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఓ మంత్రిని హత్య చేస్తామనే ధోరణిలో వ్యాఖ్యానించడం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ప్రోత్సహించేది లేదని.. దీనిపై  కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. మంత్రిని హత్య చేస్తామనే విధంగా మాట్లాడిన మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, ఆయన కుమారుడిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.

Trending News