Kisan Rail: అనంతపురం నుంచి ఢిల్లీ చేరిన తొలి కిసాన్ రైలు

దక్షిణాదిన అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైన తొలి కిసాన్ రైలు ఢిల్లీకి (Kisan Rail reach Delhi from Anantapur) చేరింది. 332 టన్నుల పండ్లు, కూరగాయలను ఏపీ నుంచి ఢిల్లీకి కిసాన్ రైలు రవాణా చేసింది. అనంత జిల్లా రైతుల సమస్యలకు చెక్ పెట్టింది.

Last Updated : Sep 11, 2020, 07:56 AM IST
Kisan Rail: అనంతపురం నుంచి ఢిల్లీ చేరిన తొలి కిసాన్ రైలు

దక్షిణ భారతదేశం నుంచి ప్రారంభమైన తొలి కిసాన్ రైలు (First Kisan Rail From Anantapur) ఢిల్లీకి చేరింది. సెప్టెంబర్ 9న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్ జూమ్ యాప్ ద్వారా జెండా ఊపి ఏపీలోని అనంతపురం రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభించిన కిసాన్ రైలు (Kisan Rail) నేటి (సెప్టెంబర్ 11) ఉదయం వాయవ్య ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

మొత్తం 332 టన్నుల పండ్లు, కూరగాయలను కిసాన్ రైలు అనంతపురం నుంచి ఢిల్లీకి తీసుకొచ్చింది. అనంతపురం జిల్లా రైతుల ఆశల్ని కిసాన్ రైలు తీర్చనుంది. అందులో తొలి అడుగు పడింది. జిల్లాలో పండిస్తున్న ఉద్యాన ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ కోసం ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో చర్చించగా  ఢిల్లీకి ప్రత్యేకంగా ‘కిసాన్‌ రైలు’ బుధవారం ప్రారంభించారు. అసలే కరోనా కారణంగా గిట్టుధర లేక ఇబ్బంది పడుతున్న పండ్లు, కూరగాయల రైతులకు ఇది భారీ ఊరటగా చెప్పవచ్చు. Vadivel Balaji Dies: కమెడియన్ వడివేల్ బాలాజీ మృతి

దక్షిణ భారతదేశం నుంచి ఇది తొలి కిసాన్ రైలు సౌకర్యం కాగా, మహారాష్ట్ర తర్వాత ఇది రెండో ‘కిసాన్‌ రైలు’ కావడం గమనార్హం. వచ్చే నెల నుంచి కిసాన్ రైలును పూర్తిస్థాయిలో నడిపేలా చర్యలు చేపట్టనున్నారు. కిసాన్ రైలులో ఉద్యాన పంటలు, పండ్లు, కూరగాయలు, పూలు రవాణా చేయనున్నారు. లారీ లాంటి వాహనాలలో అయితే ఖర్చు ఎక్కువ, సమయం అధికంగా పోతుంది. కిసాన్ రైలు ద్వారా కేవలం 36 గంటల్లో రైలు ఢిల్లీకి చేరుతుంది. తక్కువ ఖర్చుతో మంచి గిట్టుబాటు ధర దొరకనుండటం గమనార్హం.  Anchor Anasuya Photos: యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ ఫొటోస్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News