COVID-19 in AP: ఏపీలో ఆగని కరోనా విజృంభణ

ఏపీలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల మధ్య 70,993 కరోనా పరీక్షలు చేయగా అందులో 10,601 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మొత్తం 5,17,094 కి చేరింది.

Last Updated : Sep 8, 2020, 07:23 PM IST
COVID-19 in AP: ఏపీలో ఆగని కరోనా విజృంభణ

అమరావతి : ఏపీలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల మధ్య 70,993 కరోనా పరీక్షలు చేయగా అందులో 10,601 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మొత్తం 5,17,094 కి చేరింది. కరోనా కారణంగా గత 24 గంటల్లో మొత్తం 73 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య మొత్తం 4,560 కి చేరింది. Also read : Flash news: తెలంగాణ అసెంబ్లీ ఉద్యోగికి కరోనా 

గత 24 గంటల్లో 11,691 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలా ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,15,765 మందికి చేరింది. Also read : Mask: ఏ మాస్క్ లు ప్రయోజనకరం..ఏవి కావు?

పీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రంలో 42,37,070 కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 96,769 యాక్టివ్ కేసులు ఉన్నాయి. Also read : Bigg Boss Telugu 4 contestant Gangavva: గంగవ్వ ఎవలు, బిగ్ బాస్‌కి ఎట్లొచ్చింది ?

Trending News