Life imprisonment for gang rape : అత్యాచార వీడియో వెలుగులోకి వచ్చి ఐదుగురికి యావజ్జీవం

Five youths awarded life imprisonment in Anantapur District for rape : ఆమెను బెదిరించి సమీపంలోని చెక్‌డ్యాం వద్దకు బైక్‌పై తీసుకెళ్లారు. తర్వాత బోయ బాలు, బోయ నాగరాజు, కుమ్మర నగేష్, తలారి నరసింహులు, కుమ్మర ఆనంద్‌ కలిసి సామూహికంగా ఆమెపై అత్యాచారం (Rape) చేశారు. అదంతా మొబైల్స్‌లలో (Mobiles‌) వీడియో తీశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 10, 2021, 11:37 AM IST
  • వివాహితపై అత్యాచారం కేసులో ఐదుగురు ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష
  • అనంతపురం నాల్గో అదనపు జిల్లా కోర్టు తీర్పు
  • 2014 జూన్‌ 2న ఘటన
 Life imprisonment for gang rape : అత్యాచార వీడియో వెలుగులోకి వచ్చి ఐదుగురికి యావజ్జీవం

Five youths sentenced to life imprisonment on the charge of gang rape in Anantapur District: వివాహితపై అత్యాచారం కేసులో ఐదుగురు ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్షపడింది. ఈ మేరకు అనంతపురం (Anantapur) నాల్గో అదనపు జిల్లా కోర్టు (District Court) తాజాగా తీర్పునిచ్చింది. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు (Anantapur District Paddavaduguru) మండలం క్రిష్టిపాడు (Kristipadu) గ్రామానికి చెందిన బోయ బాలు, బోయ నాగరాజు, కుమ్మర నగేష్, తలారి నరసింహులు, కుమ్మర ఆనంద్‌ అనే యువకులు బైక్‌లపై 2014 జూన్‌ 2న ముప్పాలగుత్తి వైపు బయలుదేరారు. 

అదే సమయంలో కదరగుట్టపల్లికి (Kadaraguttapalli) చెందిన ఒక వివాహిత పశువులకు గడ్డి కోసం పొలానికి వెళ్తూ ఉంది. అయితే ఆమెను బెదిరించి సమీపంలోని చెక్‌డ్యాం వద్దకు బైక్‌పై తీసుకెళ్లారు. తర్వాత బోయ బాలు, బోయ నాగరాజు, కుమ్మర నగేష్, తలారి నరసింహులు, కుమ్మర ఆనంద్‌ కలిసి సామూహికంగా ఆమెపై అత్యాచారం (Rape) చేశారు. అదంతా మొబైల్స్‌లలో (Mobiles‌) వీడియో తీశారు. ఈ ఘటన గురించి ఎవరికైనా చెప్తే వీడియోను బయట పెడతామంటూ బాధితురాలిని బెదిరించారు. 

తర్వాత ఆ అత్యాచార వీడియోను (Rape video) నిందితులు.. నల్లబోతుల శివకృష్ణ మూర్తి, బోయ రామాంజనేయులుకు షేర్ చేశారు. అలా ఒకరి నుంచి ఒకరికి ఈ వీడియో షేర్ అవుతూ వచ్చింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు (Complain to the police) చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. 2014 జూన్ ఏడో తేదీన ఐదుగురిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. మేజిస్ట్రేట్‌ (Magistrate‌) రిమాండ్‌కు (Remand‌) ఆదేశించారు.2014 జులై 14న మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసి కోర్టులో (Court) హాజరుపరిచారు.

Also Read : Anasuya Bharadwaj: పుష్పలో అనసూయ లుక్ మామూలుగా లేదుగా..!

అయితే బాధితురాలిని బైక్‌పై తీసుకెళ్తుండగా చూసిన సాక్షులు (Witnesses)... మళ్లీ బాధితురాలు ఏడుస్తూ తిరిగొస్తుండగా చూసిన వారి సాక్ష్యాలతో ఈ కేసు మరింత బలపడింది. పోలీసులు నిందితుల మొబైల్‌ ఫోన్లలోని అత్యాచార వీడియో క్లిప్పింగ్‌లను (Video clipping‌s) స్వాధీనం చేసుకున్నారు. అలాగే నేరం జరిగిన చోట ఆధారాలను సేకరించారు.

కేసు విచారణలో ఉండగానే నల్లబోతుల శివకృష్ణమూర్తి అలియాస్‌ రామకృష్ణ, బోయ రామాంజనేయులు అలియాస్‌ రాంబాబు అనారోగ్యంతో చనిపోయారు. ముద్దాయిలపై అభియోగాలు రుజువు కావడంతో బోయ బాలు, బోయ నాగరాజు, కుమ్మర నగేష్, తలారి నరసింహులు, కుమ్మర ఆనంద్‌లకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి 25 వేల రూపాయల జరిమానా విధించింది కోర్టు. ఈ మేరకు అనంతపురం నాలుగో అదనపు జిల్లా కోర్టు జడ్జి (Anantapur Fourth Additional District Court Judge) సునీత తీర్పునిచ్చారు. అలాగే ఈ కేసులో (Case) ముద్దాయిలు (Defendants) చెల్లించే జరిమానా అంతా కూడా బాధితురాలికి చేరాలని కోర్టు (Court) తీర్పు ఇచ్చింది.

Also Read : AP CM YS JAGAN: బ్రేకింగ్ న్యూస్, ముందస్తు ఎన్నికలకు వైఎస్ జగన్, ఇక నిత్యం ప్రజల్లోన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News