Kothapalli Subbarayudu: చెప్పుతో కొట్టుకున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు..

Kothapalli Subbarayudu slaps himself with slipper:  మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తనను తాను చెప్పుతో కొట్టుకోవడం నర్సాపురంలో హాట్ టాపిక్‌గా మారింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2022, 04:58 PM IST
 Kothapalli Subbarayudu: చెప్పుతో కొట్టుకున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు..

Kothapalli Subbarayudu slaps himself with slipper: వైసీపీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తనను తాను చెప్పుతో కొట్టుకున్నారు. నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చేస్తున్న ఉద్యమానికి స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజు దూరంగా ఉండటంపై ఆయన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం (మార్చి 2) అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టగా.. ఈ సందర్భంగా సుబ్బారాయుడు అనూహ్య చర్యకు పాల్పడ్డారు. ఎమ్మెల్యే ప్రసాదరాజు గెలుపుకు మద్దతునిచ్చి తప్పు చేశానని.. అందుకు తనను తాను చెప్పుతో కొట్టుకుంటున్నానని అన్నారు.

ఒక అసమర్థుడిని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు బాధపడుతున్నానని సుబ్బారాయుడు పేర్కొన్నారు. నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించేంతవరకూ రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. సుబ్బారాయుడు చెప్పుతో కొట్టుకోవడంతో అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. అంతకుముందు, నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సుబ్బారాయుడు బైక్ ర్యాలీ నిర్వహించారు. 

ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలు చేయనున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే కొత్త జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తోంది. ఈ క్రమంలో నర్సాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించిన ప్రభుత్వం.. జిల్లా కేంద్రంగా భీమవరంను ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

నర్సాపురం కేంద్రంగానే జిల్లా ఏర్పాటు కావాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపడుతున్నారు. అయితే ఈ ఆందోళనలకు స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజు దూరంగా ఉంటున్నారు. దీంతో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రసాదరాజుపై ఆగ్రహంగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రసాదరాజు గెలుపుకు సహకరించి తప్పు చేశానని చెబుతూ.. ఏకంగా చెప్పుతో కొట్టుకున్నారు. ఇప్పుడీ అంశం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. 

Also Read: Radhe Shyam Trailer: రాధేశ్యామ్ మూవీ రెండో ట్రైలర్ వచ్చేసింది..!

Also Read: Ghani Movie Release Date: వరుణ్ తేజ్ గని మూవీ విడుదల తేది ఫిక్స్.. ఈసారి పక్కా రిలీజ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News