Vallabhaneni Vamsi : పరిటాల సునీతకు వల్లభనేని వంశీ కౌంటర్, ఇప్పుడే రాజీనామా చేస్తా

Vallabhaneni Vamsi Counters on Paritala Sunitha: వచ్చే ఎన్నిక వరకు ఎందుకు ఆగాలి.. తాను ఇప్పుడే రాజీనామా చేస్తాను వంశీ వెల్లడించారు. చంద్రబాబు నాయుడు తల్లికి, గర్భస్థ శిశువుకు కూడా తగాదా పెట్టగలిగే వ్యక్తి అని విమర్శించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 23, 2021, 06:39 PM IST
  • చంద్రబాబు నాయుడు దీక్షలో పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రియాక్ట్
  • తాను రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటన
  • ఖాళీ లెటర్ హెడ్ పై సంతకం చేసి పరిటాల సునీతకు పంపించిన వంశీ
Vallabhaneni Vamsi : పరిటాల సునీతకు వల్లభనేని వంశీ కౌంటర్, ఇప్పుడే రాజీనామా చేస్తా

GANNAVARAM MLA Vallabhaneni Vamsi Counters on tdp leader Paritala Sunitha Comments : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీక్షలో పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) రియాక్ట్ అయ్యారు. తాను రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు. పరిటాల సునీతను (Paritala Sunitha) తాను వదినగానే చూస్తానని స్పష్టం చేశారు వంశీ. ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. వచ్చే ఎన్నిక వరకు ఎందుకు ఆగాలి.. తాను ఇప్పుడే రాజీనామా చేస్తాను వంశీ వెల్లడించారు. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తల్లికి, గర్భస్థ శిశువుకు కూడా తగాదా పెట్టగలిగే వ్యక్తి అని విమర్శించారు. 

Also Read :  Vallabhaneni Vamsi slams Lokesh: లోకేశ్‌కు మ్యాటర్‌ లేదు : వల్లభనేని వంశీ ఘాటు వ్యాఖ్యలు

ఇక కొడాలి నాని, వల్లభనేని వంశీలకు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీనే అని.. కానీ వారిద్దరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ తాజాగా మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunitha) విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వారిద్దరూ ఓడిపోవడం ఖాయమని అన్నారు. 

Also Read : pattabhi bail : పట్టాభికి బెయిల్‌, టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో 10 మంది అరెస్ట్‌

ఈ నేపథ్యంలో రాజీనామాకు తాను ఇప్పుడే సిద్ధమని వల్లభనేని వంశీ పేర్కొన్నారు. అలాగే తన ఖాళీ లెటర్ హెడ్ పై (Letterhead) సంతకం చేసి పరిటాల సునీతకు పంపించారు. దమ్ముంటే నారా లోకేశ్ (Nara Lokesh( గన్నవరంలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. పరిటాల సునీత సారథ్యం వహించి లోకేష్‌తో పోటీ చేయించి గెలిపించుకోవాలని వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) సవాల్‌ చేశారు.

Also Read : Rashmika Mandanna : రష్మిక వర్క్ అవుట్ అదిరిపోయింది.. షాట్ ఓకే అంటూ తరుణ్ కామెంట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News