AP Weather Report: ఏపీకి హీట్‌వేవ్ అలర్ట్.. అప్పటి వరకు ఎండ వేడి తప్పదని వార్నింగ్

AP Heatwave Report: తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావాలంటే అల్లాడిపోతున్నారు. ఎంతో తప్పనిసరి అయితే తప్ప ఇల్లు వీడి బయటికి రావడం లేదు. ఇక ఉద్యోగం పని మీద బయటికొచ్చే వాళ్లు, చిరు వ్యాపారులకు అయితే ఎండవేడికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2023, 06:32 AM IST
AP Weather Report: ఏపీకి హీట్‌వేవ్ అలర్ట్.. అప్పటి వరకు ఎండ వేడి తప్పదని వార్నింగ్

AP Heatwave Report: సూర్యుడు వేసవి కాలం ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ వేడి భరించలేనిదిగా ఉంటోంది. మధ్యాహ్నం వేళళ్లో అయితే భానుడి ప్రతారం మరింత తారా స్థాయికి చేరుకుంటోంది. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావాలంటే అల్లాడిపోతున్నారు. ఎంతో తప్పనిసరి అయితే తప్ప ఇల్లు వీడి బయటికి రావడం లేదు. ఇక ఉద్యోగం పని మీద బయటికొచ్చే వాళ్లు, చిరు వ్యాపారులకు అయితే ఎండవేడికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. 

ఇదిలావుంటే, ఏపీలో రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఎండవేడి మరింత అధికంగా ఉంటుందని తాజాగా భారత వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. ఏపీతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిషా, బీహార్ రాష్ట్రాల్లోనూ భానుడు భగభగ మండిపోనున్నాడు. 

భారత వాతావరణ విభాగం అధికారులు పేర్కొన్న వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 15వ తేదీ వరకు ఎండలు మండిపోనున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రలో ఎండల తీవ్రత అధికంగా ఉండనుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా భారీ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్రతో పాటు ఒడిషా వరకు ఈ నెల 15వ తేదీ శనివారం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే బీహార్ లో ఏప్రిల్ 15 నుంచి 17వ తేదీ వరకు అదే తరహాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఈ నెల 17వ తేదీ వరకు ఎండలు దంచికొట్టనున్నాయి.

ఇది కూడా చదవండి : Thota Chandrasekhar Press Meet: ఇది ఏపీలో బీఆర్ఎస్ పార్టీ సాధించిన తొలి విజయం

ఇది కూడా చదవండి : CM Jagan Mohan Reddy: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్.. జూన్ నాటికి 1.50 లక్షల మందికి ఇళ్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News