టీడీపీ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేనా ?

                                                           

Last Updated : Jul 18, 2018, 11:22 AM IST
టీడీపీ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేనా ?

మరో మారు మోడీ సర్కార్ పై టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఈ విషయంలో విపక్ష పార్టీల మద్దతు కూడగట్టిన టీడీపీ ఎంపీలు కాన్ఫిడెన్స్ తో సమావేశాలకు సిద్ధమౌతున్నారు. ఇప్పటి వరకు 150 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చినట్లు టీడీపీ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. మరింత మంది సభ్యులు అవిశ్వాసతీర్మానికి మద్దతు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే మోడీ సర్కార్ కు ఇబ్బందులు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 

టీపీపీకి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందా..?
మరోవైపు కాంగ్రెస్ కూడా ఇదే అంశంపై మోడీ సర్కార్ పై అవిశ్వాసం ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అయితే ఇప్పటికే టీడీపీ అవిశ్వాసం తీర్మానికి సంబంధించిన నోటీసు ఇవ్వడంతో ఆ పార్టీకి సపోర్టు చేస్తుందా.. లేదంటే సొంతగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతుందా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. 

చర్చపై నీలినీడలు
ఇదిలా ఉండగా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుందా లేదా అన్నదానిపై అనుమానాలు నెలకొన్నాయి. గతంలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సమయంలో టీఆర్ఎస్, అన్నాడీఎంకే సభ్యులు తమ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ఆందోళన చేయడంతో అవిశ్వాసంపై చర్చ జరగలేదు. ఈ సారి అదే సీన్ రీపీట్ అవుతుందా..లేదో వేచిచూడాల్సిందే మరి.

 

Trending News