తిరుపతి దేవస్థానంలో ముస్లిం ఉద్యోగులను తొలిగించడం రాజ్యాంగ విరుద్ధం..!

తిరుమల తిరుపతి దేవస్థానంలో కులమతాలకతీతంగా అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న 45 ముస్లిములతో పాటు మైనారిటీ ఉద్యోగులను తొలిగించడం రాజ్యంగ విరుద్ధమని టిటిడి స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ తెలిపింది.

Last Updated : Jan 29, 2018, 12:24 PM IST
తిరుపతి దేవస్థానంలో ముస్లిం ఉద్యోగులను తొలిగించడం రాజ్యాంగ విరుద్ధం..!

తిరుమల తిరుపతి దేవస్థానంలో కులమతాలకతీతంగా అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న 45 ముస్లిములతో పాటు మైనారిటీ ఉద్యోగులను తొలిగించడం రాజ్యంగ విరుద్ధమని టిటిడి స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ తెలిపింది. ఏళ్లతరబడి టీటీడీలో పనిచేస్తున్న ఈ ఉద్యోగులను మతం పేరుతో బయటకు పంపించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.

తిరుమల శ్రీవారి ఆలయ అభివృద్ధితో పాటు కైంకర్య సేవల్లో అనాది కాలం నుండి మతాలకతీతంగా ముస్లిములు కూడా పాల్గొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఫ్రంట్ తెలిపింది. శ్రీవారి ఆలయంలో ముస్లిం వనిత బీబీనాంచారి విగ్రహానికి పూజలు చేయగా లేనిది.. ముస్లిం ఉద్యోగులకు ఇక్కడ ఉపాధి కల్పిస్తే తప్పేంటని ఈ సందర్భంగా ఫ్రంట్ పేర్కొంది.

శ్రీవారి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ' బ్యాక్‌ సవారీ' ముస్లిం మత ఆచారమేనని.. అలాగే ఆర్జితసేవల్లో వినియోగించే బంగారు కలువపూలు ముస్లిం భక్తుడు సమర్పించినవేనని గతంలో టీటీడీ మాజీ ఈఓ పివిఆర్‌కే ప్రసాద్ స్వయంగా తెలిపిన వైనాన్ని ఈ సందర్భంగా ఫ్రంట్ గుర్తుచేసింది. పరమత సహనాన్ని పాటించే భారతదేశంలో.. కార్మిక హక్కులను తుంగలో తొక్కి.. 45 మంది మైనారిటీ ఉద్యోగుల్ని తొలగించడం రాజ్యాంగ విరుద్దమని టిటిడి ఉద్యోగుల పరిరక్షణ వేదిక అధ్యక్షులు, రిటైర్డ్‌ జడ్జి పెనుమూరు గురప్ప, కన్వీనర్‌ కందారపు మురళిలు ఒక ప్రకటనలో తెలిపారు. 

Trending News