Rain Alert: ఏపీలో తొలగని వర్షముప్పు, ఆ 5 జిల్లాలకు ఆరెంజ్ ఆలర్ట్ జారీ

michaung cyclone update: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను తీరం దాటినా ఇంకా ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. ఏపీలో విధ్వంసం రేపిన మిచౌంగ్ ప్రభావంతో ఇంకా భారీ వర్షాలు పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 8, 2023, 04:31 PM IST
Rain Alert: ఏపీలో తొలగని వర్షముప్పు, ఆ 5 జిల్లాలకు ఆరెంజ్ ఆలర్ట్ జారీ

michaung cyclone update: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తీవ్ర తుపానుగా మారి బాపట్ల వద్ద మంగళవారం తీరం దాటింది. తుపాను ప్రభావంతో రెండు మూడ్రోజుల్నించి ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అటు చెన్నైలో మిచౌంగ్ కారణంగా అతి భారీ వర్షాలు మరోసారి 2015 నాటి వరదల్ని గుర్తు చేశాయి. 

ఏపీలో విధ్వంసం రేపిన మిచౌంగ్ తుపాను తీరం దాటాక క్రమంగా బలహీనపడుతోంది. తీవ్ర తుపాను నుంచి తుపానుగా మారిన మిచౌంగ్ క్రమంగా వాయుగుండంగా, ఆపై అల్పపీడనంగా మారుతూ ఉత్తరాంధ్ర భూభాగం వైపుకు వెళ్లనుంది. తుపాను తీరం దాటినా సరే ఇంకా ఏపీకు వర్షాల ముప్పు మాత్రం తొలగలేదు. ఏపీలోని ఐదు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో ఏపీలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. అంటే ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురవనున్నాయి. తుపాను తీరం దాటడంతో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా ప్రాంతంలో తేలికపాటి వర్షాలు పడనున్నాయి. ఇక తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు అప్పుడే వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది..

తుపాను ప్రభావంతో వర్షాలు ఇంకా కొనసాగనుండటంతో ఏపీలో ఇవాళ కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అన్ని విద్యాసంస్థల్ని మూసివేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. కాకినాడ నుంచి నెల్లూరు వరకూ ఉన్న విద్యాసంస్థలు ఇవాళ అంటే బుధవారం కూడా విద్యా సంస్థలు తెరవకూడదు. 

Also read: CM YS Jagan Mohan Reddy: ఏపీపై మిచౌంగ్ తుపాను భారీ ఎఫెక్ట్.. సీఎం జగన్ కీలక ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News