#APCoronaVirusUpdates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. అత్యధికంగా ఒకరోజు 5 కరోనా మరణాలు సైతం ఏపీలో సంభవించాయి. గురువారం నాటికి ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 534కు చేరుకుందని తెలిసిందే. చికిత్స అనంతరం 20 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 500 మంది కరోనాతో పోరాడుతున్నారు. కరోనా బారిన పడి రాష్ట్రంలో మొత్తం 14 మంది చనిపోయారు. అక్కడబ్బాయి.. ఇక్కడమ్మాయి.. వాట్సాప్‌లో పెళ్లి!
కరోనా నుంచి కోలుకున్న ఓ తల్లి, కుమారుడిని వైద్యులు డిశ్ఛార్జ్ చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన ముస్లిం మహిళకు, ఆమె కుమారుడికి కరోనా పాజిటివ్‌గా తేలగా గత కొన్ని రోజులుగా వైద్యులు చికిత్స అందించారు. తాజాగా వచ్చిన కోవిడ్19 టెస్టు ఫలితాలలో ఆమెతో పాటు కుమారుడికి నెగటివ్‌గా తేలడంతో ఆ కుటుంబం సంతోషంలో మునిగి తేలుతోంది. రిపోర్టులు పరిశీలించిన వైద్యులు వీరిని డిశ్ఛార్జ్ చేసి అంబులెన్స్‌లో ఇంటి వద్ద డ్రాప్ చేసినట్లు సమాచారం. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. కరెన్సీ నోట్లతో కరోనా వ్యాపిస్తుందా ?
#CovidUpdates: Mother and son walk out together healthy and strong after recovering from #corona in Anantapur today! @anantapurgoap #APFightsCorona pic.twitter.com/fSOISMLYde
— ArogyaAndhra (@ArogyaAndhra) April 16, 2020
కాగా, రాష్ట్రంలో తొలి కరోనా మరణం నమోదైంది అనంతపురంలో కావడం గమనార్హం. జిల్లాలవారీగా చూస్తే.. గుంటూరులో అత్యధికంగా 122, కర్నూలులో 113 కరోనా పాటిటివ్ కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఇప్పటివరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..