జనసేనానికి పరిటాల సునీత ఆహ్వానం

జనసేనాని పవన్ కళ్యాణ్‌కు ఏపీ మంత్రి పరిటాల సునీత ఆహ్వానం పలికారు. పవన్ కళ్యాణ్ పోరాట యాత్రల పేరుతో సమయాన్ని వేస్ట్ చేస్తున్నారని ఆమె తెలిపారు. 

Last Updated : Jun 4, 2018, 12:50 AM IST
జనసేనానికి పరిటాల సునీత ఆహ్వానం

జనసేనాని పవన్ కళ్యాణ్‌కు ఏపీ మంత్రి పరిటాల సునీత ఆహ్వానం పలికారు. పవన్ కళ్యాణ్ పోరాట యాత్రల పేరుతో సమయాన్ని వేస్ట్ చేస్తున్నారని ఆమె తెలిపారు. పవన్ ఆలోచనలు మంచివేనని.. ఆయనలో యువరక్తం ఉందని.. అయితే పనులు చేయాలని భావిస్తున్న ప్రభుత్వంపై విమర్శలు మానాలని ఆమె అన్నారు.

ఒకవేళ పవన్ కళ్యాణ్ తగు సూచనలు, సలహాలు ఇచ్చి ప్రభుత్వం చేయాలనుకుంటున్న అభివృద్ధిలో పాలుపంచుకుంటే తాము సంతోషిస్తామని సునీతమ్మ అన్నారు. తెలుగుదేశంతో కలిసి నడవాలని భావిస్తే.. తాము ఆహ్వానిస్తామని కూడా ఆమె అన్నారు. అయితే తాను చెబుతున్న అంశాలు, విషయాలు అన్నీ కూడా తన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే గానీ.. పార్టీతో సంబంధం లేని అంశాలని పరిటాల సునీత తెలియజేశారు. గుంటూరులో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Trending News