Pawan Kalyan: అజ్ఞానం ప్రదర్శించిన పవన్‌ కల్యాణ్‌?.. నవ్వుకుంటున్న ఓటర్లు

Pawan Kalyan Casting Vote Video Goes Viral: ఎన్నికల సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన ఓటు వేసే సమయంలో వ్యవహరించిన తీరు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 13, 2024, 07:36 PM IST
Pawan Kalyan: అజ్ఞానం ప్రదర్శించిన పవన్‌ కల్యాణ్‌?.. నవ్వుకుంటున్న ఓటర్లు

Pawan Kalyan Viral Video: ఎన్నికల సమయంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్న క్రమంలో ఓ స్లిప్‌ అడిగారు. ఎన్నికల సిబ్బందికి అర్థం కాక గందరగోళానికి గురయ్యారు. అనంతరం ఓటు వేసిన స్లిప్‌ వస్తుందా? అని ప్రశ్నించారని చర్చ జరుగుతోంది. పోలింగ్‌ కేంద్రంలో పవన్‌ కల్యాణ్‌ వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Also Read: AP Elections High Tension: పోలింగ్‌ రోజు ఆంధ్రప్రదేశ్‌లో రచ్చరచ్చ.. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలతో చాలాచోట్ల ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీతో కలిసి జనసేన పార్టీ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో కూటమి ఉంది. సోమవారం ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ జరిగింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఓటు హక్కు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఉంది. పోలింగ్‌లో ఓటు వేసేందుకు ఉదయమే తన సతీమణితో కలిసి పవన్‌ కల్యాణ్‌ మంగళగిరిలోని పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. పోలింగ్‌ సిబ్బంది ఆయన పత్రాలు పరిశీలించి పంపించారు. అనంతరం ఈవీఎం మిషన్‌ వద్దకు వెళ్లిన పవన్‌ కల్యాణ్‌ ఓటేశారు. అయితే ఓటేసిన తర్వాత బయటకు రాలేదు.

Also Read: Himanshu Rao: తొలిసారి ఓటు వేసిన మాజీ సీఎం కేసీఆర్‌ మనుమడు హిమాన్షు రావు

అక్కడే ఉన్న సిబ్బందితో కొద్దిసేపు మాట్లాడారు. వారి సంభాషణను గమనిస్తుంటే 'ఓటు వేసిన తర్వాత ప్రింట్‌ అవుట్‌ రాదా?' అని ప్రశ్నించారు. 'రాదు సార్‌. వీవీ ప్యాట్‌లో మాత్రమే చూసుకోవచ్చు' అంటూ సిబ్బంది సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తిరుగుతోంది. ఈ వీడియోను చూసి ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక రాజకీయ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వ్యక్తికి ఆమాత్రం తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో వీవీ ప్యాట్‌ స్లిప్‌ వచ్చేది కానీ కొన్నేళ్లుగా ఎన్నికల సమయంలో ఆ స్లిప్‌ రావడం లేదు. ఇది దాదాపుగా ఓటర్లందరికీ తెలుసు. కానీ ఈ విషయం పవన్‌కు తెలియదా? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ వీడియో కాస్త అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చిక్కింది. ఆ వీడియోను అడ్డం పెట్టుకుని పవన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. 'పోలింగ్‌ బూత్‌లో అజ్ఞానం చాటిన పవన్‌ కల్యాణ్‌. 2 లక్షల పుస్తకాలు చదివిన జ్ఞానం ఇదేనా పవన్‌ కల్యాణ్‌? కర్మ కాకపోతే ఓటు గురించి కనీస పరిజ్ఞానం లేని నువ్వు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడివి. ప్రజలు నిన్ను ఛీ కొట్టడంలో తప్పే లేదు' అంటూ ధ్వజమెత్తింది.

కాగా పవన్‌ కల్యాణ్‌ కూటమి తరఫున పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఓడిపోయిన పవన్‌ ఈసారి గెలుపు కోసం తహతహలాడుతున్నారు. తన విజయం కోసం సినీ పరిశ్రమను పిఠాపురంలో దింపారు. అంతేకాకుండా మెగా కుటుంబం, ఇతర సినీ ప్రముఖుల ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా మద్దతు పొందారు. మరి ఆయన విజయం సాధిస్తారా? లేదా అనేది అత్యంత ఉత్కంఠ ఏర్పడింది. కాగా ఆయనకు పోటీగా అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు. దాదాపు ఆమెకు విజయావకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

 

Trending News