జనసేన పార్టీకి విజయ బాబు గుడ్ బై !

జనసేన పార్టీకి విజయ బాబు రాజీనామా

Updated: Dec 2, 2018, 02:00 PM IST
జనసేన పార్టీకి విజయ బాబు గుడ్ బై !

హైదరాబాద్: 2019 ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటుకోవాలనే లక్ష్యంతో ఇప్పుడిప్పుడే జనాల్లోకి దూసుకుపోతున్న జనసేన పార్టీలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. జనసేన పార్టీకి అధికార ప్రతినిధిగా సేవలు అందిస్తూ పార్టీని వెన్నంటి వున్న కమిషనర్‌ విజయబాబు పార్టీకి రాజీనామా చేశారు. విజయబాబు రాజీనామా పార్టీ వర్గాల్లోనే కాకుండా రాజకీయపక్షాల్లోనూ చర్చనియాంశమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సమాచార హక్కు చట్టం కమిషన్‌లో కమిషనర్‌గా పనిచేసి, ఆ పదవీ బాధ్యతల నుంచి రిటైర్ అయిన అనంతరం జనసేన పార్టీలో చేరి పార్టీకి అధికార ప్రతినిధిగా పనిచేశారు. 

ALSO READ : జనసేనలో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు.. టీడీపీపై సంచలన ఆరోపణలు!

తన వ్యక్తిగత కారణాల వల్లే పార్టీని వీడుతున్నట్లు విజయబాబు ప్రకటించినప్పటికీ.. కొద్దిరోజులు ఆగితేకానీ ఆయన నిర్ణయం వెనుకున్న అసలు కారణాలు తెలిసే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close