Prakasam Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన కారు.. ఐదుగురు అక్కడికక్కడే మృతి

Prakasam Road Accident: ప్రకాశం జిల్లాలో ఓ కారు లారీని ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మృతులను పల్నాడు వాసులుగా గుర్తించారు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 8, 2022, 05:07 PM IST
  • ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • లారీని ఢీకొట్టిన కారు
  • ఐదుగురు అక్కడికక్కడే మృతి
  • మృతులంతా పల్నాడు వాసులు
Prakasam Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన కారు.. ఐదుగురు అక్కడికక్కడే మృతి

Prakasam Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు మాచర్ల నుంచి తిరుపతి వెళ్తుండగా కంభం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల వద్ద లభించిన ఆధారాలతో వారి వివరాలను గుర్తించారు. వీరంతా పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు వాసులుగా గుర్తించారు. మృతుల పేర్లు గురువమ్మ (60), అనిమిరెడ్డి (60),అనంతమ్మ (55), ఆదిలక్ష్మి (58), నాగిరెడ్డి (24)గా వెల్లడించారు.

ప్రమాద ఘటనపై మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఇవాళ పోస్టుమార్టమ్ అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. 

కాగా, ఇటీవలి కాలంలో ప్రకాశం జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్దిరోజుల క్రితం వెంకటాచలంపల్లి వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా ఘటనలో ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు హైదరాబాద్ నుంచి కనిగిరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

Also Read: Horoscope Today August 8th : నేటి రాశి ఫలాలు.. ప్రేమలో ఉన్న ఈ రాశి వారిని ఇబ్బందులు చుట్టుముడుతాయి..

Also Read: Komati Reddy Rajagopal Reddy: పోచారంను కలవనున్న రాజగోపాల్‌రెడ్డి..రాజీనామా లేఖ సమర్పణ..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News