ఉమ్మడి హైకోర్టు చీఫ్ జస్టిస్ గా రాధాకృష్ణన్

జస్టిస్ రాధాకృష్ణన్ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రానున్నారు. ఈ మేరకు ఆయన పేరును సుప్రీంకోర్టు కొలిజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. కేబినెట్‌ ఆమోదించగానే రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసి ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వుల జారీ చేస్తారు. ప్రస్తుతం రాధాకృష్ణన్ ఛత్తీస్ గఢ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు రాగానే ఆయన తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపడతారు.

Last Updated : Jan 12, 2018, 11:52 AM IST
ఉమ్మడి హైకోర్టు చీఫ్ జస్టిస్ గా రాధాకృష్ణన్

హైదరాబాద్: జస్టిస్ రాధాకృష్ణన్ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రానున్నారు. ఈ మేరకు ఆయన పేరును సుప్రీంకోర్టు కొలిజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. కేబినెట్‌ ఆమోదించగానే రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసి ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వుల జారీ చేస్తారు. ప్రస్తుతం రాధాకృష్ణన్ ఛత్తీస్ గఢ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు రాగానే ఆయన తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపడతారు.

2016 ఆగస్టు నుంచి ఉమ్మడి హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా  జస్టిస్ రమేశ్ రంగరాజన్ బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అధికారికంగా సీజేగా రాధాకృష్ణన్ నియమాకం జరిగి.. బాధ్యతలు స్వీరించే వరకు రంగరాజన్ తాత్కాలిక సీజే గా కొనసాగుతారు.

Trending News