Kumari Aunty: ప్లేటు ఫిరాయించిన కుమారీ ఆంటీ.. ఆ అభ్యర్థికి ఎన్నికలలో ఓటు వేయాలని ప్రచారం.. వీడియో వైరల్..

Ap assembly Elections 2024: స్ట్రీట్ ఫుడ్ ఫెమ్ కుమారీ ఆంటీ ఒక్కసారిగా ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని అందరిని షాకింగ్ కు గురిచేశారు. పదిహేనేళ్ల క్రితం గుడివాడ ఎలా ఉందో ఇప్పుడు కూడా అదేవిధంగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఉద్యోగాలు, ఉపాధి దొరక్కపోవడం  వల్లనే పక్కరాష్ట్రాలకు వెళ్తున్నామంటూ వ్యాఖ్యలు చేశారు.  

Written by - Inamdar Paresh | Last Updated : May 10, 2024, 01:33 PM IST
  • కొడాలి నానిపై కుమారి ఆంటీ విమర్శలు..
  • టీడీపీ కూటమిని గెలిపించాలంటూ ఏపీలో ప్రచారం..
Kumari Aunty: ప్లేటు ఫిరాయించిన కుమారీ ఆంటీ.. ఆ అభ్యర్థికి ఎన్నికలలో ఓటు వేయాలని ప్రచారం.. వీడియో వైరల్..

Kumari aunty election campaign for gudivada tdp leader venigandla ramu: స్ట్రీట్ ఫుడ్ ఫెమ్ కుమారీ ఆంటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓవర్ నైట్ లో తన రుచికరమైన వంటకాలతో అందరిని తన ఫుడ్ స్టాల్ కు రప్పించుకున్నారు. కస్టమర్ల తాకిడి ఎక్కువ కావడం వల్ల ట్రాఫిక్ పోలీసులు సైతం ఆమె స్టాల్ ను క్లోజ్ చేయాలని ఆదేశించారు. దీంతో ఆమె స్థానిక నేతలు, సీఎం వరకు వెళ్లి తన బాధలు చెప్పుకున్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కుమారీ ఆంటీ స్టాల్ ను యథాప్రకారం నడిపించేలా చూడాంటూ సూచించారు. వీలు చేసుకుని తాను స్వయంగా కుమారీ ఆంటీ స్టాల్ వంటకాలు రుచి చూస్తానంటూ కూడా స్పందించారు. దీంతో ఒక్కసారిగా ఫెమస్ అయిన పోయిన కుమారీ ఆంటీ కోసం అనేక మీడియా హౌస్ లు, యూట్యూబ్ ఛానెల్స్ లు ఇంటర్వ్యూల కోసం పోటీపడ్డాయి. ప్రతిరోజు ఫుడ్ ప్రియులు.. ఆమె స్టాల్ ముందు భారీగా క్యూలైన్లలో ఉంటు టెస్టీ ఫుడ్ కోసం వేచిచూసేవారు.

 

ఇక తెలంగాణలోని నిరుద్యోగులు సైతం.. తమ గోడును సీఎం రేవంత్ వరకు తీసుకెళ్లాలంటూ ఆమెకు వినతిపత్రం ఇచ్చారంటూ ఆమె  ఏరేంజ్ లో ఫెమస్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. గతంలో కుమారీ ఆంటీ సీఎం జగన్ అన్న తనకు ఏపీలో ఇల్లు కూడా ఇచ్చారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇక ఎన్నికల రాగానే ఏ పార్టీ నాయకులైన సెలబ్రీటీలు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, మంచి పబ్లిసీటీ ఉండేవారిని తమకు అనుకూలంగా ప్రచారం నిర్వహించేందుకు బరిలో దించుతుంటారు. 

ఈ నేపథ్యంలో.. తాజాగా, ఆమె గుడివాడలో ఎన్నికల ప్రచారంలో  టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. గుడివాడ పట్టణంలోని 32,31,25,21,24 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఈ  నేపథ్యంలో కుమారీ ఆంటీ మాట్లాడుతూ.. 15 ఏళ్ల క్రితం గుడివాడ ఎలా ఉందో, ఇప్పటికి కూడా అలాటే అభివృద్ధి లేకుండా ఉందని అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకపోతే ప్రజలు నష్టపోతారని ఆమె అన్నారు. గుడివాడ అభ్యర్థి వెనిగండ్ల రామును పొగొడ్తలతో ముంచెత్తారు. ఆయన.. మహర్షి సినిమాలో మహేష్ బాబు లాంటి మంచి మనసున్న వ్యక్తి  అంటూ పొగిడారు. సినిమాలో మహేష్ బాబు ప్రజల కోసం సేవ చేస్తే, రియల్ లైఫ్ లో రాము గారు కూడా ప్రజాసేవలో ఎప్పుడూ కూడా ముందుంటున్నారని ఆమె వ్యాఖ్యలు చేశారు. తన స్వస్థలమైన పేద ఎరుకపాడులో ప్రజలందరి మంచి కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

Read More: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...

వెనిగండ్ల రాము గారు గెలిస్తేనే గుడివాడ అభివృద్ధి జరుగుతుందని కుమరీ ఆంటీ అన్నారు. గుడివాడలో ఉపాధి అవకాశాలు, లేకపోవడంతో నాలాంటి వారు ఎందరో పక్క రాష్ట్రాలు వెళ్లి కష్టపడాల్సి వస్తుందని, కొడాలి నాని హయాంలో అభివృద్ధి లేకపోగా, ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడలేదని విమర్శలు గుప్పించారు. చక్కటి విజన్ ఉన్న  వెనిగంట్ల రాము గారు, కష్టపడే వారికి, విద్యావంతులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇప్పటికే అనేక రకాలుగా చర్యలు తీసుకున్నారని కుమారీ ఆంటీ ప్రచారం నిర్వహించారు. ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా వెనిగండ్ల రాము గారిని, గ్లాస్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వల్లభనేని బాలశౌరి గారిని గెలిపించి,ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలవాలని ఆమె ప్రచారం నిర్వహించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News