ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి

ప్రత్యేక హోదా కోసం విద్యార్థి  ఆత్మహత్య

Last Updated : Sep 18, 2018, 09:11 AM IST
ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి

రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్న మనస్తాపంతో కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన విద్యార్థి మహేంద్ర (14) సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మహేంద్ర మృతదేహం వద్ద సూసైడ్‌ నోట్‌ దొరికింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

తమ కుటుంబానికి అప్పులున్నాయని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే తన అన్నకి ఉద్యోగం వచ్చేదని, హోదా ఇవ్వకపోవడం వల్ల తాను చదువుకున్నా.. ఉద్యోగం రాదని నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ప్రత్యేక హోదా కోసం విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. హోదాపై కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కావని, పోరాడి సాధించుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

కాగా.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మహేందర్‌కు పలు రాజకీయ పార్టీలు సంతాపం తెలిపాయి. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి.. కాంగ్రెస్ పార్టీ తరఫున కొంత ఆర్థిక సహాయం అందజేశారు.

 

Trending News