YS Jagan Mohan Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

JC Prabhakar Reddy Comments On AP CM YS Jagan :

Written by - Shankar Dukanam | Last Updated : Mar 18, 2021, 04:32 PM IST
  • తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ కౌన్సిలర్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నిక
  • ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
  • త్వరలోనే వైఎస్ జగన్‌ను కలుసుకుంటానని చెప్పిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్
YS Jagan Mohan Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tadipatri Municipal Chairman JC Prabhakar Reddy : తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ తొలగిపోయింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ కౌన్సిలర్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. అనంతరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నైతిక విలువలు ఉన్న వ్యక్తి అని కామెంట్ చేశారు. 

ఆయన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి లాగానే ఏపీ సీఎం వైఎస్ జగన్‌లోనూ విలువలు పరిపూర్ణంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. నేటితో ఆ విషయం ఏపీ ప్రజలకు స్పష్టంగా అర్థమైందన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ సహకారం లేకపోతే తాను ఈరోజు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యే వాడిని కాదని జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలుస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. తనపై విశ్వాసం ఉంచిన స్థానిక ప్రజల కోసం తాడిపత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఎంపీ తలారి రంగయ్యలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ వెల్లడించారు. 

Also Read: JC Prabhakar Reddy: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా జేసీ ప్రభాకర్ రెడ్డి, పంతం నెగ్గించుకున్న TDP

కాగా, తాడిపత్రి మున్సిపాలిటీ(Tadipatri Municipal Chairman)లో మొత్తం 36 వార్డులుండగా, ఎన్నికలకు ముందే వైఎస్సార్‌సీపీ 2 వార్డులు ఏకగ్రీవం చేసుకుంది. ఎన్నికల్లో టీడీపీ 18, వైఎస్సార్‌సీపీ 14 వార్డులు, సీపీఐ, ఇండిపెండెంట్ ఒక్కో వార్డులో గెలుపొందారు. అయితే అధికార వైఎస్సార్‌సీపీ తలుచుకుంటే తాడిపత్రి చైర్మన్ పదవి కైవసం చేసుకోగలదని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ, అలాంటి ప్రయత్నాలు జరగకపోవడంతో ప్రతిపక్ష టీడీపీ తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ పదవి దక్కించుకుంది.

Also Read: TDP Chief Chandrababu: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు AP CID నోటీసులు

ఇటీవల ఎక్స్ అఫీషియో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న ఎమ్మెల్సీల దరఖాస్తులను మున్సిపల్ కమిషన్ నరసింహ ప్రసాద్ రెడ్డి తిరస్కరించడంతో ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి టీడీపీ తరఫున ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ తరఫున ముగ్గురు ఎమ్మెల్సీలు దరఖాస్తు చేసుకోగా, వీరి దరఖాస్తులు తిరస్కరించడంతో పాటు వీరికి ఓటు హక్కు లేదని తెలిపారు. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీల ఓట్లు మాత్రమే చెల్లుతాయని ట్విస్ట్ ఇచ్చారు. 

Also Read: Tadipatri Municipal Chairman Election: ఉత్కంఠగా మారిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక, MLC ఓట్లు చెల్లవట

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News