బూత్ స్థాయి కమిటీలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి

Last Updated : Jun 13, 2018, 05:34 PM IST
బూత్ స్థాయి కమిటీలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి

ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో చంద్రబాబు పార్టీ యంత్రాంగాన్ని సమయాత్తం చేసే పనిలో పడ్డారు. ఎన్నికలు ఎదుర్కొవాలంటే బూత్ స్థాయి కమిటీలే ప్రధాన పాత్ర పోషిస్తున్నందున ఆయన దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 55 శాతం బూత్ స్థాయి కమిటీలు వేయడం పూర్తయినట్లు సమాచారం. ఇక మిగిలిన పని కూడా శరంవేగంగా చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం అమరావతిలోని ప్రజాదర్బార్‌ హాలులో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారు.

ఈవీఎంలతో జాగ్రత్త ...

 బూత్ స్థాయి సభ్యులందరూ  ఈవీఎంల పట్ల అవగాహనతో మెలగాలని చంద్రబాబు సూచించారు.  ఏ ఎలక్ట్రానిక్ వస్తువునైనా దుర్వినియోగం చేయటం సులభతరమని..ఎన్నికల సమయంలో ఈవీఎంలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ విషయంలో పార్టీ కేడర్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Trending News